Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

సత్యవేడు నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి

*సత్యవేడు నియోజకవర్గ సమస్యలు పరిష్కరించండి*

✍️ *జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు కు ఎమ్మెల్యే ఆదిమూలం వినతి*

 

✍️ *కలెక్టర్, ఎస్పీ, సీఎండీ లకు ఎమ్మెల్యే నూతన సంవత్సర శుభాకాంక్షలు*

 

సత్యవేడు నియోజకవర్గంలోని పలు సమస్యలకు పరిష్కారం చూపాలని కోరుతూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ను కోరారు.

 

సోమవారం తిరుపతి లోని కలెక్టర్ కార్యాలయానికి ఎమ్మెల్యే చేరుకొని ఈ మేరకు కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.

 

ఇందులో ప్రధానంగా రోడ్లు, వంతెనలు, పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ ఉన్నాయి.

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం జిల్లా కలెక్టర్ కు శాలువ కప్పి పుష్ప గుచ్చం అందించి 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

 

తదుపరి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, విద్యుత్ శాఖ సీఎండీ శివశంకర్ లను వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకొని శాలువ కప్పి పుష్ప గుచ్చం అందించి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

శ్రీవారి సేవలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు

Garuda Telugu News

చంద్రగిరి-శ్రీవారిమెట్టు మార్గంలో 9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం 

Garuda Telugu News

తెదేపా పొలిట్ బ్యూరో మెంబర్ వర్ల రామయ్య గారితో భేటి అయిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు

Garuda Telugu News

Leave a Comment