Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

డ్రోన్ నిఘా నీడలో చిత్తూరు జిల్లా…

*చిత్తూరు జిల్లా పోలీసు*

*డ్రోన్ నిఘా నీడలో చిత్తూరు జిల్లా.*

 

*డ్రోన్ సహాయంతో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిని అదుపులోకి తీసుకున్న చిత్తూరు 1 టౌన్ పోలీసులు.*

 

చిత్తూరు జిల్లా మొత్తాన్ని నిరంతరం డ్రోన్ నిఘాలో ఉంచి పర్యవేక్షిస్తున్న సందర్భంగా, చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని PVKN, సాంబయ్య కండ్రిగ అడవి ప్రాంతంలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న మూడు గుంపులను పోలీసులు డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించారు.

 

తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, సంబంధిత చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.

 

1 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ మహేశ్వర గారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గుంపులుగా చేరి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం చట్టవిరుద్ధమని, ఇటువంటి చర్యలు ఎవరైనా కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

జనహితానికి, ప్రజల భద్రత కోసం డ్రోన్ నిఘా మరియు పర్యవేక్షణ కొనసాగుతుందని ఆయన తెలియజేశారు.

Related posts

పిచ్చాటూరు ఎంపీడీవో మహమ్మద్ రఫీ పర్యవేక్షణలో బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తుదారుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ (ఇంటర్వ్యూ) చేసిన బ్యాంకు అధికారులు….

Garuda Telugu News

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పిల్లలకు ప్లేట్లు వాటర్ బాటిల్స్ పంపిణి

Garuda Telugu News

తెదేపా పొలిట్ బ్యూరో మెంబర్ వర్ల రామయ్య గారితో భేటి అయిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు

Garuda Telugu News

Leave a Comment