Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్ సార్… శ్రీకాళహస్తి మండలానికి తహసిల్దార్ ని నియమించండి

కలెక్టర్ సార్… శ్రీకాళహస్తి మండలానికి తహసిల్దార్ ని నియమించండి

— శ్రీకాళహస్తి మండలం వైఎస్సార్సీపీ మాజీ అధ్యక్షులు బర్రి హేమభూషణ్ రెడ్డి విజ్ఞప్తి

 

— తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మండల ప్రజలు

 

— ఇప్పటికే ఇద్దరు తహసిల్దార్లు మారిపోయారు

 

— మండలంలో పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలు

 

— కేవలం ఆదాయ ధృవీకరణ పత్రాలకు పరిమితమైన డీటీ లు

 

— ఇప్పటికైనా స్పందించండి

 

(శ్రీకాళహస్తి)

జనవరి 04:

 

కలెక్టర్ సార్… శ్రీకాళహస్తి మండలానికి తహసిల్దార్ ను నియమించాలని శ్రీకాళహస్తి మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు, తొండమాన్ పురము సర్పంచ్ బర్రి హేమభూషణ్ రెడ్డి కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆయన తొండమాన్ పురము లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే శ్రీకాళహస్తి మండలం అతి పెద్ద మండలమని చెప్పారు. పెద్ద మండలానికి తాసిల్దార్ లేకపోవడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి మండలానికి తహసిల్దార్ నియామకం ఎప్పుడు జరుగుతుందో ఆ సర్వేశ్వరునికి తెలియాలని మండల ప్రజలు వాపోతున్నారని ఆయన పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలు కాలంలో ఇప్పటికే ఇద్దరు తహసిల్దార్లు వెళ్లిపోయారని చెప్పారు. ఇలా తహసిల్దార్ వెళ్లిపోవడం వలన మండల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. తాసిల్దార్లు వెళ్లిపోయినప్పుడు తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న డీటీలను ఇంచార్జ్ తాసిల్దారులుగా నియమించి మమా అనిపిస్తున్నారని వాపోయారు. రెగ్యులర్ తహసిల్దార్ లేకపోవడం వలన పి జి ఆర్ ఎస్ కలెక్టర్ కార్యాలయం నుండి వచ్చే స్పందన స్పందన వెనతులు ప్రజా దర్బార్ నుండి వచ్చే సమస్యలు ఎక్కడికి అక్కడ పేరుకు పోయాయని దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. కార్యాలయంలో ఉన్న డిప్యూటీ తాసిల్దారులు కేవలం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరుకే పరిమితం అయిపోయారని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి రెగ్యులర్ తాసిల్దార్ ను నియమించాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

శ్రీ మహాలక్ష్మి అవతారంలో పోలేరమ్మ దర్శనం…

Garuda Telugu News

హోం మంత్రి అమిత్ షా తక్షణం తన పదవికి రాజీనామా చేయాలి

Garuda Telugu News

ఏఐవైఎఫ్ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి 

Garuda Telugu News

Leave a Comment