*ఇరిగేషన్ పనులపై జర్నలిస్టుల కమిటీతో విచారణకు సిద్ధం*

*నేను తప్పు చేసినట్టు నిరూపిస్తే తలదించుకుంటా*
*జిల్లాకు రూ.93 కోట్లు ఎఫ్.డీఆర్ నిధులు వస్తే…నేను సర్వేపల్లిలో రూ.100 కోట్లు దోచేశానంట*
*వైసీపీ పాలనలో చేసిన అడ్డగోలు దోపిడీ భ్రమల్లో నుంచి బయటకు రాలేకపోతున్న సిగ్గులేని కాకాణి*
*ఒక్క ఇరిగేషన్ లోనే కాదు…అన్ని శాఖల పనుల్లోనూ కాకాణి అండ్ బ్యాచ్ దోపిడీ*
*అడ్డగోలు పనులు చేయడం కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకోవడం అలవాటుగా మార్చుకున్న గోవర్ధన్ రెడ్డి*
*తల్లిదండ్రులను దారుణంగా హింసించిన వ్యక్తిని పరామర్శించి పోలీసులపై ఆరోపణలు చేయడానికి సిగ్గుందా*
*నెల్లూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*
సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు సాక్షి పత్రికకు మానవత్వం కరువైపోయాయి
ప్రతిపక్షం అంటే మౌనంగా ఉండదు..,విమర్శించాలి..అవి కూడా వాస్తవాలకు దగ్గరగా ఉండాలి
కానీ మనిషికి ఉండాల్సిన కనీస లక్షణాలను కోల్పోతే ఎలా…నిత్యం పచ్చిఅబద్ధాల కూతలు కూయడమే పని
40 ఏళ్ల నా రాజకీయ చరిత్రలో కాకాణి లాంటి పనికిమాలిన లక్షణాలు ఉన్న వ్యక్తిని చూడలేదు
మొంథా తుఫాన్ నేపథ్యంలో కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా చేపట్టాల్సిన ఇరిగేషన్ పనులకు రూ.93 కోట్ల ఎప్.డీ,ఆర్ నిధులు మంజూరు చేశారు
కోవూరుకు రూ.20 కోట్లు, కావలికి రూ.19.18 కోట్లు, సర్వేపల్లికి రూ.16.90 కోట్లు, నెల్లూరు రూరల్ కు రూ.12.63 కోట్లు, ఆత్మకూరుకు రూ.10.31 కోట్లు, ఉదయగిరికి రూ.7.26 కోట్లు, వెంకటగిరికి రూ.6 కోట్లు మంజూరయ్యాయి.
సర్వేపల్లికి రూ.16.90 కోట్లు మంజూరైతే నేను వంద కోట్లు తినేశానంటూ కాకాణి కూస్తాడు..ఆ కూతలు కూయడానికి నోరెలా వస్తుందో
అంటే కావలి, కోవూరుతో పాటు మిగిలిన నియోజకవర్గాలకు కూడా నేను పోయి తినేసిరావాలా
కాకాణికి సరే సిగ్గులేదు….కనీసం సాక్షికి అయినా సిగ్గుండాలి కదా
మా నియోజకవర్గంలో 316 మంజూరైతే ఇప్పటికి 30 శాతం పనులు కూడా పూర్తికాలేదు..కొన్ని పనులు అసలు ప్రారంభమే కాకపోగా మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి
ఎఫ్.డీ.ఆర్ నిధులకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క బిల్లు కూడా చేయకపోయినా వంద కోట్లు దోపిడీ అంటే కాకాణి కూస్తున్నాడు
గత ఏడాది సుమారు రూ.13 కోట్లతో 160కి పైగా పనులను రైతుల భాగస్వామ్యంతో చేపట్టాం
కాకాణికి రాజకీయలక్షణాలు, సిగ్గు,శరం ఉంటే గత ఏడాది బిల్లులు చేసిన పనుల్లో చేయలేదని ఒక్కటి చూపించాలి
పొదలకూరులో కారుకూతలు కూస్తున్న వైసీపీ నేతలకు మా నాయకులు సవాల్ విసిరితే పత్తా లేకుండా పోయారు
పని చేయకుండా సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక్క బిల్లు చేసివున్నా నేను సిగ్గుతో తలదించుకుంటా
కాకాణి తాను సర్వేపల్లికే అధ్యక్షుడిని కాదు,,జిల్లా అధ్యక్షుడిని అని నిరూపించుకోవాలంటే పనులు చేయకుండానే బిల్లులు ఎక్కడ చేసుకున్నామో చూపాలి
మొంథా తుఫాన్ ప్రభావంతో సర్వేపల్లి నియోజకవర్గంలోని టీపీగూడూరు, ముత్తుకూరు, వెంకటాచలంలో జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది..ఇక్కడ మంజూరైన నిధులు రూ.16.90 కోట్లు మాత్రమే
2021 డిసెంబర్ 12న జిల్లాలో ఎఫ్.డీ.ఆర్ పనుల కింద కాకాణి రూ.232 కోట్లు మంజూరు చేయించుకున్నాడు
అసలు జిల్లాలో వర్షమే లేదు..కేవలం సోమశిల జలాశయానికి మాత్రమే వరద వచ్చింది..
వరద ప్రవాహం మొత్తం పెన్నానదిలో నుంచి సముద్రంలో కలిసిపోయింది…సర్వేపల్లి, కృష్ణపట్నం, వల్లూరు కాలువలకు చుక్క వరద రాలేదు
అయినా ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే 474 పనులకు గాను రూ.47.89 కోట్లు మంజూరు చేయించుకున్నాడు
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన పనులపై జర్నలిస్టు కమిటీతో విచారణ జరిపించేందుకు నేను సిద్ధం
కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పిన వాళ్లను కూడా కమిటీలో నియమించుకోవచ్చు
గత 18 నెలల మా పాలనలో ఒక్క పనిని అయినా చేయకుండా బిల్లు చేసుకోవుంటే నిరూపించమనండి
మేం ఒక్క తప్పు చేసినట్టు నిరూపించినా తల దించుకుంటా
అదే సమయంలో 2021లో మంజూరైన రూ.47.89 కోట్లలో ఎన్ని పనులను చేయకుండా బిల్లులు చేసుకున్నారో చూపిస్తాం
షట్టర్లు బిగించకుండానే ఒకటికి మూడు సార్లు బిగించినట్టు చూపి శ్రీధర్ ఇంజనీరింగ్ కంపెనీ పేరుతో రూ.9 కోట్లు బిల్లులు చేసుకున్నారు
ఎన్నికలకు కొన్ని నెలల ముందు ప్యాకేజీల పేరుతో రూ.18.50 కోట్లు విలువైన పనులు చేయకుండానే బిల్లులు చేసుకునేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయిన సిగ్గులేనోడు కాకాణి
సీఈ తిరస్కరించిన ఐదు ప్యాకేజీలను అప్పటి ఎస్ఈ కృష్ణమోహన్ సహకారంతో పెట్టించుకుని బిల్లులు చేసుకోవాలని చూశాడు..కృష్ణమోహన్ రిటైరైపోయినా చేసిన పాపాలకు శిక్ష నుంచి తప్పించుకోలేడు
నేను జిల్లా మీడియాను స్వయంగా తీసుకెళ్లి పొట్టేళ్ల కాలువతో పాటు అక్కంపేట చెరువులను చూపించాను..అక్కడ పనులు జరిగిన ఆనవాళ్లే లేకపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు
వైసీపీ పాలనలో ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఇరిగేషన్ పనుల్లో కాకాణి అండ్ బ్యాచ్ రూ.150కి పైగా కోట్లు దోచుకుంది
ఇరిగేషన్ పనుల్లోనే కాదు…మిగిలిన శాఖల పరిధిలోనూ కాకాణి దోపిడీ యథేచ్ఛగా జరిగింది
సర్వేపల్లి నియోజకవర్గానికి నుడా నిధులు రూ.30 కోట్లు మంజూరు చేయించాడు
ఒక్క చవిటి కాలువ కడితే డ్వామా నిధులకు అదే చూపిస్తారు…నుడా నిధులకే అదే కాలువ..చివరకు ఎంపీపీ నిధులకు కూడా అదే కాలువ చూపించారు
అడ్డమైన పనులు చేసి విచారణలో దొరికిపోవడం, కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం కాకాణికి అలవాటుగా మారిపోయింది
ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఇటీవల జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు నేను నేరుగా ప్రభుత్వానికి లేఖ రాశా
మొదటి డ్రాప్ట్ నోటిఫికేషన్ తో జిల్లాకు జరిగే నష్టాన్ని సీఎంఓతో పాటు కేబినెట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాను…మొదటి లేఖను మీడియాకు రిలీజ్ చేశాం..రెండో సారి సవివరంగా పంపిన లేఖను మాత్రం విడుదల చేయలేదు
కాకాణి మాదిరిగా ఎదవ కూతలు కూసేందుకు మేం రాజకీయాల్లోకి రాలేదు…అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేస్తుంటాం
సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులే చేయొద్దని కాకాణి చెబుతాడా..
కాకాణి లాంటి సిగ్గులేని వ్యక్తులను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పెట్టిన జగన్మోహన్ రెడ్డిని అనాలి
వెంకటాచలం మండలం ఇడిమేపల్లిలో గురవయ్య అనే వ్యక్తి తన భార్య, అత్త, బావమరుదలతో కలిసి తల్లిదండ్రులపై దాడికి పాల్పడ్డాడు
కన్నతల్లిని వివస్త్రను చేసి రోడ్డుపై వేసి దారుణంగా కొట్టారు…సొంత బిడ్డే అత్తింటి వారితో కలిసి అమానుషంగా కొట్టారని కన్న తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు
ఆ గురవయ్యను సీఐ కొట్టాడని కాకాణి నోటికొచ్చినట్టు మాట్లాడాడు..నిత్యం పోలీసులను బెదిరించడమే పనిగా పెట్టుకున్నాడు
కండీషన్ బెయిల్ పై బయట తిరుగుతూ కాకాణి కూస్తున్న కూతలేంటి
వైసీపీ నాయకులు పోలీసులంటే భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు
మా ప్రభుత్వం అధికారంలో ఉంటే కూడా మా ఫ్లెక్సీలు ధ్వంసం చేసి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు
ఒక రోజు శివుడికే శఠగోపం పెట్టానని మాట్లాడాడు. శివాలయం భూములను నేను రూ.కోటికి అమ్ముకున్నానంట
ఆలయ కమిటీ మీడియా ముందుకు వచ్చి కాకాణి అబద్ధాల బండారాన్ని బయటపెట్టింది.
శివాలయానికి సంబంధించిన 48 సెంట్లను ఏ విదంగా వాడుకున్నామో ఆధారాలతో సహా చూపించింది
నేను శివాలయం భూమిని అమ్మకున్నానని అడ్డంగా మాట్లాడిన తర్వాత మా కుటుంబం రూ.70 కోట్లకు పైగా విలువైన 14.5 ఎకరాల భూములను హైస్కూళ్లు, ఆస్పత్రి, కాలనీల నిర్మాణానికి ఇచ్చామని వెల్లడించాను
నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో రెండు హై స్కూళ్లు, ఒక ఆస్పత్రి, ఒక మిక్సెడ్ కాలనీ, వరిగొండలో ఎస్టీ కాలనీకి భూములిచ్చాం
అయినా కాకాణికి సిగ్గులేదు…నిత్యం శివాలయం భూములని నోటికొచ్చినట్టు కూస్తాడు
కాకాణిది అత్యంత దుర్మార్గమైన బతుకు
2016లో నా కుటుంబానికి విదేశాల్లో వెయ్యి కోట్ల ఆస్తులున్నాయంటూ నకిలీ పత్రాలు తయారుచేయించాడు
ఇప్పుడేమో కోర్టులో తనకు తెలియదని, ఎవరో చెబితే నమ్మి ఆరోపణలు చేశానని అఫిడవిట్ ఫైల్ చేసిన కాకాణిది ఒక బతుకా
ఈయన మళ్లీ పెద్ద చదవరంట…పీహెచ్డీ, వంకాయ పులుసు…దేనీకి ఆయన చదువు
నిత్యం అవినీతి బురదలో పొర్లాడే కాకాణి ఆ మకిలిని మాపై చల్లితే తుడుచుకుంటూ కూర్చువాలా
ప్రజా ఉద్యమంపైకి హిజ్రాలను దాడికి ఉసిగొల్పిన చేత కాని వ్యక్తి కాకాణి
అక్రమ మైనింగ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి రెండు నెలలు కనిపించకుండా పారిపోయాడు
అడ్డగోలు మాటలతో ఇప్పుడు మళ్లీ అదే బాటలో నడుస్తున్నాడు
కాకాణికి సిగ్గుంటే మా కుటుంబానికి ఆయన చెప్పిన 1000 కోట్లు ఎక్కడ ఉన్నాయో చూపించాలి….ప్రభుత్వం వచ్చిన మొదట్లో చెప్పిన రూ.100 కోట్లు, ఇప్పుడు చెబుతున్న నెలకు రూ.20 కోట్లు, రూ.30 కోట్లు ఎక్కడున్నాయో చెప్పాలి
వాడెవడో ఫోన్ పేలో డబ్బులు వేయించుకుంటే నేను రూ.100 కోట్లు దోచుకున్నానంట…ఏం కర్మయ్యా ఇది
మనిషికి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటి కూడా కాకాణిలో కనిపించడం లేదు
వైసీపీ హయాంలో కృష్ణపట్నం పోర్టు వద్ద ఏర్పాటు చేసిన టోల్ గేట్ ఘటనపై పోలీసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి
రూ.70 లక్షలు నేరుగా కాకాణి కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాలోకి జమ అయ్యాయని విచారణలో తేలింది
దానికి సమాధానం చెప్పడు కానీ..నేను, నా కొడుకు వందల కోట్లు దోచుకుంటున్నామంట
ఏదైనా గ్రామంలో బేస్మెంట్లలోకి ఎవరైనా ట్రాక్టర్ తో నాలుగు ట్రిప్పులు మట్టి తోలుకుంటే సోమిరెడ్డికి రూ.100 కోట్లు అనడానికి సిగ్గుండబళ్లేదా
2024 ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే కొన్ని గంటల ముందు తన అల్లుడిని ఊరిబిండి ప్రభాకర్ రెడ్డికి చెందిన కంపెనీలో సీఈఓగా చేర్పిస్తాడు..రాత్రికి రాత్రే ఆ కంపెనీకి రామదాసుకండ్రిగలో 57 ఎకరాలు ధారాదత్తం చేశాడు
రోజూ ప్రెస్ మీట్లు పెట్టే కాకాణికి సిగ్గుంటే రామదాసుకండ్రిగ భూములపై మీడియాకు సమాధానం చెప్పాలి
వందల ఎకరాలున్న కోటీశ్వరులు, ఇన్ కం ట్యాక్స్ చెల్లించే వారికి పొదలకూరు మండలం మరుపూరులో 57 ఎకరాల భూములను సంతర్పణ చేశాడు
కొమ్మలపూడిలో జాతీయ రహదారి పక్కనే ఉన్న 19.70 ఎకరాల విలువైన భూముల రికార్డులు మార్పించేశాడు
సూరాయపాళెంలో 36 ఎకరాలు, ఆల్తుర్తిలో 100 ఎకరాల విషయంలో అక్రమాలకు పాల్పడ్డాడు
తిరుమలమ్మపాళెం హైలెవల్ బ్రిడ్జి పనులను అడ్డుకున్నాడు..డేగపూడి-బండేపల్లి కాలువ, సోమశిల దక్షిణ కాలువ పనులదీ అదే పరిస్థితి
కాకాణి అడ్డగోలు కూతలు తప్ప మా రాజకీయ జీవితంలో ఏ రోజూ ఒక మాట అనిపించుకోలేదు..
వావిలేటిపాడులో 4.20 ఎకరాల దళితుల భూములను ఆక్రమించి కంచె వేసుకున్నాడు…మేం ఆ కబ్జాను నిరూపించి ఆ కంచెను పగలగొట్టిన రోజే సిగ్గున్నోడు అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసివుండేవాడు
చేసిన దొంగతనాలన్నింటిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కాకాణి నిత్యం నాపై విమర్శలు చేయడం సిగ్గుచేటు
జర్నలిస్టుల కమిటీ విచారణకు సిద్దమా
