*దేశంలోనే తొలిసారి విద్యుత్ ఛార్జీల తగ్గింపు*

– గత ప్రభుతం ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 32 వేల 116 కోట్లు భారం మోపింది.
– యూనిట్ కు 13 పైసలు విద్యుత్ ఛార్జి తగ్గించి చంద్రబాబు చారితాత్మక నిర్ణయం తీసుకున్నారు.
– 20 నెలల కూటమి పాలనలో నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో 74 మందికి 1 కోటి 25 లక్షలు, కోవూరు నియోజకవర్గంలో 571 మందికి 6 కోట్ల 20 లక్షల 53 వేలు వేల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందించాం.
– సిఎంఆర్ఎఫ్ ద్వారా చంద్రబాబు నాయుడు నిరు పేదలకు మెరుగైన ప్రాణభిక్ష పెడుతున్నారు.
– ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి .
గత ప్రభుతం ఐదేళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై 32 వేల 116 కోట్లు భారం మోపితే కూటమి ప్రభుత్వం యూనిట్ కు 13 పైసలు విద్యుత్ చార్జీలు తగ్గించిందన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. నెల్లూరు నగరం మాగుంట లేఔట్ లోని విపిఆర్ నివాసంలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఆమె ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందచేశారు. 22 వ విడత సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గ పరిధిలో 34 మందికి 17 లక్షల రూపాయల 25 వేల రూపాయలు, నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు 13 మందికి దాదాపు 8 లక్షల 60 వేల రూపాయల విలువైన చెక్కులు అందచేశారు. కూటమి ప్రభుత్వం అధికారం లోనికి వచ్చాక నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో 74 మందికి దాదాపు 1 కోటి 25 లక్షల రూపాయలు.కోవూరు నియోజకవర్గంలో 571 మంది అనారోగ్య బాధితులకు 6 కోట్ల 20 లక్షల 53 వేలు వేల అందించినట్టు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గార్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు మాట్లాడుతూ 2019లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి రాష్టంలో మిగులు విద్యుత్ వుందన్నారు. విద్యుత్ ఛార్జీలను పూర్తిగా తగ్గించేస్తానని ప్రగల్భాలు పలికి ట్రూ ఆప్ పేరిట గత ఐదేళ్ల పాలనలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి రాష్ట ప్రజల నడ్డి విరిచారన్నారు. ట్రూ డౌన్ అమలు ద్వారా విద్యుత్ ఛార్జీల్లో యూనిట్ కు 13 పైసలు తగ్గించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందనన్నారు. 4 వేల 498 కోట్ల రూపాయల ట్రూఅప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఒక చారిత్రాత్మక నిర్ణయమన్నారు. గత ప్రభుత్వ పాలనలో అక్వా రైతులకు యూనిట్ రూ.3.50 వసూళ్లు చేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత యూనిట్ రూ.1.50లకు తగ్గిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. సిఎంఆర్ఎఫ్ ద్వారా నిరు పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సంకల్పం లక్షలాది మందికి ప్రాణభిక్ష పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పెన్నాడెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాలరెడ్డి, కొడవలూరు మండల టీడీపీ అధ్యక్షులు నాపై వెంకటేశ్వర్లు నాయుడు, బుచ్చి, కోవూరు, విడవలూరు, ఇందుకూరు పేట మండలాల టిడిపి అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు, కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఏటూరి శ్రీహరి శ్రీహరి రెడ్డి, ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు ఇంతా మల్లారెడ్డి, బెజవాడ వంశీకృష్ణారెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, రాష్ట చేనేత సంఘ నాయకులు కెవి శేషయ్య, యల్లాయపాలెం, గుండాలంపాలెం సొసైటీల అధ్యక్షులు ఏకొల్లు వంశీధర్ రెడ్డి, బద్వేలు వినీల్ రెడ్డి, కోవూరు నియోజకవర్గ రైతు సంఘ నాయకులు పల్లంరెడ్డి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
