Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధి

ఘనంగా కావలి రూరల్ పరిధిలో విపిఆర్ అమృత ధార వాటర్ ప్లాంట్స్ ప్రారంభోత్సవం

 

 

సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నాయని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అన్నారు కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారితో కలిసి విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కావలి రూరల్ మండలం వెంకటేశ్వరపురం, పెద్ద రాముడుపాలెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన విపిఆర్ అమృత ధార వాటర్ ప్లాంట్లను వారు ప్రారంభించారు. తొలుత వెంకటేశ్వరపురం గ్రామానికి చేరుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి గ్రామస్తులు నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం విపిఆర్ అమృత ధారా వాటర్ ప్లాంట్ ను వారు ప్రారంభించారు.

 

ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం సమయంలో హామీనిచ్చిన మేరకు వెంకటేశ్వరపురం, పెద్ద రాముడు పాలెం గ్రామాల్లో ఈ వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేశామన్నారు. స్థానిక నాయకులు ఏడుకొండలు, తిరుపతి తదితరులు శ్రద్ద తీసుకుని పనులు చేయించారన్నారు. ఈ వారంలో దాదాపు 19 ప్లాంట్లు ప్రారంభిస్తామన్నారు. ఇప్పటివరకు 175 ప్లాంట్స్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ప్లాంట్ ఇప్పటికీ నిరంతరంగా పని చేస్తుందని వివరించారు. ఏ సమస్య ఉన్నా తమ ఫౌండేషన్ చూసుకుంటుందని వివరించారు. జిల్లాలో 1050 మందికి ట్రై సైకిల్స్ ఇచ్చామని, కావలిలో 175 అందించామన్నారు. వాటి మెయింటెనెన్స్ కూడా తామే చూస్తున్నామని చెప్పారు.

 

ఉదయగిరి నియోజకవర్గం నుంచి విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని ప్రారంభించామని, ఇప్పటివరకు రెండు నెలల కాలంలో ఉదయగిరి, వరికుంటపాడు, సీతారామపురం మండలాల్లో 12 వేలమందికి కంటి పరీక్షలు నిర్వహించామన్నారు వారిలో 7000 మందికి కంటి అద్దాలు అందజేసి వారి చూపుని మెరుగుపరిచామన్నారు. ప్రస్తుతం మరో బస్సును ఏర్పాటు చేయబోతున్నట్టు వివరించారు. ఆ బస్సును కావలి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు పంపిస్తామన్నారు.

 

కావలి నియోజకవర్గ అభివృద్ధికి తమ ఎప్పుడు కట్టుబడి ఉన్నామని, ఎమ్మెల్యే అడిగిన వెంటనే కొండ బిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కోనేరు ఏర్పాటుకు రెండు కోట్ల నిధులు అందించామన్నారు. జనవరి చివరి నాటికి పూర్తి చేసేలా పనిచేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి సహకారంతో కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి 17 కోట్లతో కావలి ట్రంకు రోడ్డు విస్తరణ చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అనుకుంటే కట్టుపెట్టి సాధిస్తారని కొనియాడారు. ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం ప్రజల అదృష్టమన్నారు. ఎమ్మెల్యే తో పాటు.. ఎంపి గా నా తరఫున చేయగలిగింది చేస్తానని వెల్లడించారు. కొండ బిట్రగుంట సమీపంలోని జాతీయ రహదారిపై అండర్పాస్ ఏర్పాటుకు కేంద్రమంత్రి తో చర్చిస్తున్నామని వెల్లడించారు. సేవ చేయడానికి తాము రాజకీయాల్లోకి వచ్చామని తప్పకుండా చేసి తీరుతామన్నారు. అల్లూరు కు సెంట్రల్ లైటింగ్ తీసుకువచ్చామని చెప్పారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు అలుపెరగకుండా శ్రమిస్తున్నారని, ఇటీవల ఢిల్లీ వచ్చి లక్ష కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను రాష్ట్రానికి తీసుకువచ్చారన్నారు అందులో 15 వేల కోట్ల అనుమతులు కూడా తీసుకున్నారని కొనియాడారు. 31వ తేదీన పెన్షన్ అందజేస్తూ గ్రామీణల కళ్ళల్లో సంతోషం నింపుతున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 50 వేల కోట్లు పింఛన్ డబ్బు సం ఖర్చు చేశారున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేయడం తమకు ఎంతో గర్వకారణమని అన్నారు.

 

ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లాకి ఎంతో ఒక చరిత్ర ఉందనీ, వేల కోట్లు సంపాదించినవారు అనేకమంది జిల్లాలో ఉన్నారన్నారు. ఇటీవల కాలంలో దాతలు కనుమరుగవుతున్న తరుణంలో ప్రజల ముందుకు వచ్చిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని చెప్పారు. తన జీవితాన్ని నెల్లూరు జిల్లా అభివృద్ధికి అంకితం చేశారన్నారు. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత సంపాదించినా తన ఆనందం అంతా దీనితోనే ఉంటుందని చెప్పారు. నిరంతరం దానం చేయాలంటే దానికి మనసు ఉండాలనీ, దానికి గొప్ప మనసుతో పాటు దాతృత్వం కూడా ఉండాలన్నారు. ఇప్పుడు పెట్టిన 170 ప్లాంట్లన్నీ కూడా నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారంటే కటోరమైన దీక్ష వల్లే సాధ్యం అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి దొరకటం మన అదృష్టమని, ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం ఇద్దరం పని చేసి చూపిస్తామన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదట గ్రామానికి 90 లక్షల రూపాయల సిమెంట్ రోడ్లు వేయించనన్నారు. కరెంట్ స్తంభాలు ఏర్పాటు చేపించినట్లు వెల్లడించారు. చెప్పలేరు ఆగు దగ్గర రివీట్ మెంట్ ఏర్పాటు చేయించి నూతన రహదారిని ఏర్పాటు చేస్తామన్నారు.

 

కావలి ప్రాంతం చుట్టూ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని భవిష్యత్తులో ఈ ప్రాంతం కనక పట్టణంగా మారుతుందన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావలికి మరో బైపాస్ ఏర్పాటుకు కేంద్రం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారని ఆ రహదారి కూడా ఏర్పడితే లాజిస్టిక్ హబ్ గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారి సహకారంతో దగదర్తి ఎయిర్పోర్ట్ కు భూసేకరణకు లైన్ క్లియర్ అయిందని ఇచ్చారని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రధాత చంద్రబాబు నాయకత్వం, అదే విధంగా లోకల్ గా మనకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆశీస్సులు మనకు కావాలని నియోజవర్గానికి మెండుగా ఉంటాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులు ప్రభాకర్ రెడ్డి గారి సోదరులు వేమిరెడ్డి కోటారెడ్డి గారు, కావలి ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య, టిడిపి పార్లమెంట్ పార్టీ ట్రెజరర్ కాటంరెడ్డి రవీంద్రారెడ్డి, టిడిపి నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి జనసేన నాయకులు గుడి హరి రెడ్డి, విపిఆర్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ శంకర్, స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రభాస్‌ ‘ది రాజాసాబ్’ రన్‌టైమ్‌ ఇదే.. స్పెషల్‌ ప్రీమియర్స్‌కు ఏర్పాట్లు..!

Garuda Telugu News

జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి కొడుకు అరెస్ట్

Garuda Telugu News

తుఫాను బాధితులు అందరినీ ఆదుకుంటాం

Garuda Telugu News

Leave a Comment