Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

భోగాపురం ఎయిర్ పోర్టులో విమానం టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ‌డం హ‌ర్ష‌నీయం

అమ‌రావ‌తి

04-001-2026

 

*భోగాపురం ఎయిర్ పోర్టులో విమానం టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ‌డం హ‌ర్ష‌నీయం*

 

*విశాఖ ఎక‌న‌మిక్ జోన్ అభివృద్ధికి దోహ‌దం*

 

*జ‌గ‌న్ రెడ్డి ద్వంద వైఖ‌రిపై మండిప‌డ్డ‌ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్*

 

విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యంలో ఆదివారంనాడు ఢిల్లీనుంచి వ‌చ్చిన విమానం టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ‌డం హ‌ర్ష‌నీయ‌మ‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి నేడొక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. విశాఖ ఎక‌న‌మిక్ జోన్ అభివృద్ధికి భోగాపురం విమానాశ్ర‌యం ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. ఉత్త‌రాంధ్ర అభివృద్ధికి కేంద్ర ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని, ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దీనిపై ప్ర‌త్యేక దృష్టి సారించార‌న్నారు. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చొర‌వ‌తో భోగాపురం ఎయిర్ పోర్టులో ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని మంత్రి పేర్కొన్నారు. విశాఖ ఎక‌న‌మిక్ జోన్ కు కేంద్ర బ‌డ్జెట్లో నిధులు కేటాయించింద‌ని మంత్రి స‌త్య‌కుమార్ తెలిపారు. భోగాపురం అంత‌ర్జాతీయ ఎయిర్ పోర్టును జూన్ 26న ప్రారంభించేందుకు కూట‌మి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. ఒక‌ప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్టు అన‌వ‌స‌ర‌మ‌ని, ఎర్ర‌బ‌స్సు కూడా రాద‌ని వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్ ఎద్దేవా చేశార‌ని మంత్రి మండిప‌డ్డారు. మ‌ళ్లీ తామే అవ‌స‌ర‌మైన అనుమ‌తులు తెచ్చామ‌ని, కోర్టు కోసులు ప‌రిష్క‌రించామ‌ని జ‌గ‌న్‌ చెప్తుకొస్తున్నార‌ని మంత్రి దుయ్య‌బ‌ట్టారు. జగన్ ద్వంద వైఖరిపట్ల విరుచుకుపడ్డారు.

Related posts

శాంతిపురం చెక్పోస్ట్ ను తనిఖీ చేసిన ఏఎంసీ చైర్మన్

Garuda Telugu News

టీవీకే చీఫ్‌ విజయ్‌కు సీబీఐ సమన్లు

Garuda Telugu News

కాసేపట్లో పెళ్లి.. పెళ్లికూతురు గుండెపోటుతో మృతి

Garuda Telugu News

Leave a Comment