Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఏటా 3 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలోకి

*ఏటా 3 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలోకి*

*మిగులు జలాల విషయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకులకు తగవు*

 

*ఆల్మట్టి ఎత్తు పెంచడంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఉమ్మడి పోరాటం చేయాలి*

 

*తెలుగు రాష్ట్రాల మద్య జలాల సమస్యను సయోధ్యతో పరిష్కరించుకోవాలి*

 

*నెల్లూరులో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*

 

రాష్ట్రం విడిపోయినా ఏపీ, తెలంగాణ ప్రజలం అన్నదమ్ముల్లా కొనసాగుతున్నాం

 

బీఆర్ఎస్ ఆంధ్రా వాళ్లు దోచుకుంటున్నారని సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు వారికి బుద్ధి చెప్పారు

 

ఏడాదికి 2 వేల నుంచి 3 వేల టీఎంసీల గోదావరి జిలాలు సముద్రంలో కలిసిపోతున్నాయి

 

200 టీఎంసీల సామర్ధ్యంతో బనకచర్ల ప్రాజెక్టుకు ప్రతిపాదనలు పెడితే బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు

 

ఏపీ ఒక్క బొట్టు నీటిని వాడుకున్నా సహించబోమని హరీష్ రావు మాట్లాడారు

 

పాకిస్థాన్ వాళ్లయినా నీళ్లు తాగి బతకాలని కోరుకుంటాం..శత్రుదేశమని నీళ్లు లేక చావాలని కోరుకోం

 

గతంలో తిరుపతిలో రోజా ఇంటికి భోజనానికి వెళ్లిన కేసీఆర్ ఏమని మాట్లాడారు

 

తాను, తన సోదరుడు జగన్ రెడ్డి కలిసి మిగులు జలాలు తెచ్చి రాయలసీమను రతనాలసీమగా మారుస్తామని స్టేట్మెంట్లు ఇచ్చారు

 

మా స్నేహితుడు కేసీఆర్ చెప్పిన ఈ మాటలు హరీష్ రావుకు గుర్తు చేస్తున్నాం

 

తెలంగాణలో ఏ పార్టీ నుంచి సీఎంలు ఎన్నికైనా వాళ్లు మా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్లే ఉంటారు

 

బీఆర్ఎస్ నాయకుల స్టేట్మెంట్లకు కౌంటర్ గా ఏపీ ప్రజలు నీళ్లు వాడుకోకూడదని సీఎం రేవంత్ రెడ్డి అనరని ఆశిస్తున్నాం

 

తెలంగాణకు వచ్చే నీటిని మేం డైవర్షన్ చేసుకుంటే అభ్యంతరం చెప్పినా అంగీకరిస్తాం..వృథాగా పోయే నీళ్ల విషయంలో వివాదం అవసరమా

 

అనుమతులు లేకుండానే తెలంగాణలో పలు ప్రాజెక్టులు నిర్మించారు

 

మేం అనుమతులతోనే బనకచర్ల ప్రాజెక్టు నిర్మించుకుంటాం

 

2 వేల నుంచి 3 వేల టీఎంసీలు సముద్రంలో కలిసిపోతుంటే, వాటిలో కొన్ని వాడుకుంటామంటే మా సోదరులకు అభ్యంతరమెందుకో

 

మనమందరం తెలుగు ప్రజలం…మనలో మనకు ఒకరిపై ఒకరికి ధ్వేషమెందుకు

 

ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు ఢిల్లీలోనో, హైదరాబాద్ లోనో, అమరావతిలోనూ కూర్చుని వృథాగా పోయే నీటిని ఎలా వాడుకోవాలో చర్చించండి

 

కర్ణాటకలో ఆల్మట్టి డ్యాం ప్రాజెక్టు ఎత్తు పెంచే ప్రయత్నాలను ముందు అడ్డుకోండి

 

ఆల్మట్టి ఎత్తు పెంచితే రెండు రాష్ట్రాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది…దానిపై పోరాడాల్సిన అవసరం ఉంది

 

తెలుగు ప్రజలందరం ఒకరి శ్రేయస్సు మరొకరం కోరుకోవాలి

 

జలాల సమస్యను ఇరు రాష్ట్రాలు సయోధ్యతో పరిష్కరించుకోవాలి

Related posts

విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

Garuda Telugu News

భార్యపై అనుమానంతో ఆమె నాలుక కత్తిరించి, తలపై రోకలిబండతో కొట్టి చంపిన కామారెడ్డి వాసి

Garuda Telugu News

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే

Garuda Telugu News

Leave a Comment