Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

అంధ విద్యార్థులకు బెడ్ షీట్ల పంపిణీ

అంధ విద్యార్థులకు బెడ్ షీట్ల పంపిణీ

తిరుపతి, జనవరి 4 :

లూయిస్ బ్రెయిలీ 217 వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం అంబేద్కర్ భవన్ లో 250 మంది అంధ విద్యార్థులకు విశ్వ చేయూత సహకార సంస్థ ఆధ్వర్యంలో బట్టలు, బెడ్ సీట్లను శాప్ చైర్మన్ అనిమినీ రవి నాయుడు సతీమణి అనిమిని హిమ బిందు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ తోట వాసుదేవరాయల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందుల సంక్షేమం అభివృద్ధి కోసం అనేక సబ్సిడీ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. అందులకు ప్రత్యేక రిజర్వేషన్లు కూడా కూటమి ప్రభుత్వంలోనే ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వచైత అంధుల సహకార సంఘం అధ్యక్షులు మునిరత్నం, చిన్నారి భరోసా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ప్రేమనాథ్, స్కేటింగ్ అకాడమీ అధ్యక్షులు ప్రతాప్, డాక్టర్ చలపతి కేఎస్ ఆశ్యర్య, నవజీవనం చైర్మన్ ప్రదీప్ రెడ్డి ధనుంజయ రెడ్డి మధుసూదన్ మురళి పాల్గొన్నారు.

Related posts

టీడీపీ సభ్యత్వ నమోదులో చరిత్ర సృష్టించిన మంగళగిరి

Garuda Telugu News

వేలూరు గంగమ్మ ఆలయ మహా కుంభాభిషేకంలో ఎమ్మెల్యే ఆదిమూలం

Garuda Telugu News

ఇక మాట్లాడుకో నాయనా..?

Garuda Telugu News

Leave a Comment