
*పండుగ వాతావరణంలో*
*మీ భూమి – మీ హక్కు కార్యక్రమం*
*ప్రభుత్వ రాజముద్ర తో కూడిన పట్టాదారు పాసు పుస్తకముల పంపిణీ : ఇంచార్జి జాయింట్ కలెక్టర్ మరియు మునిసిపల్ కమీషనర్ ఎన్. మౌర్య**
*రైతుకి తన ఆస్తిపై తనకు హక్కు కలిగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మీ భూమి మీ హక్కు రాజముద్రత తో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు జారీ: చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని*
*రాజముద్రతతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలుపవచ్చు: డిఆర్ఓ నరసింహులు*
తిరుపతి. జనవరి 03:
రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ హక్కులకు సంపూర్ణ భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకములను పంపిణీ చేయడం జరిగిందని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమీషనర్ మౌర్య తెలిపారు.
చంద్రగిరి మండలం నరసింగాపురం గ్రామంలో వున్న రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాసు పుస్తకముల పంపిణీ కార్యక్రమంను స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, తిరుపతి ఆర్ డి ఓ రామ్మోహన్ తో కలసి
ఇంచార్జి జాయింట్ కలెక్టర్ మరియు మునిసిపల్ కమీషనర్ ఎన్. మౌర్య “మీ భూమి – మీ హక్కు” పట్టాదారు పాసు పుస్తకముల కార్యక్రమంను శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరoలో నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా ఇంచార్జి జాయింట్ కలెక్టర్ నగరపాలక సంస్థ కమీషనర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 23 మండలాలలో 217 గ్రామాలలో 26 212 మంది రైతులకు మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా.. రాజముద్రత తో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా నేడు చంద్రగిరి మండలం నరసింగాపురం గ్రామానికి చెందిన రైతులకు మొత్తం 113 మంది రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకములు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రైతులకు వారి భూమిపై చట్టబద్ధమైన, స్పష్టమైన హక్కులు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు. కొత్త పాసు పుస్తకముల ద్వారా భూమి సర్వే నంబర్లు, విస్తీర్ణం, యజమాని వివరాలు ఖచ్చితంగా నమోదు చేయడం జరిగిందని, దీంతో భూ వివాదాలకు ఎటువంటి ఆటంకాలు ఉండవని తెలిపారు. పాసు పుస్తకంలో తప్పులు ఉన్నచో రైతులు తిరిగి దరఖాస్తు లేదా రీ సర్వేకి పెట్టుకోవచ్చని తెలియజేశారు. రైతులు అందుబాటులో లేకుండా వారి సమీప బంధువుల ద్వారా కూడా పాసు పుస్తకములు పంపిణీ చేసేలా చూస్తామని తెలిపారు. భూ రికార్డుల డిజిటలైజేషన్ ద్వారా రైతులకు బ్యాంకు రుణాలు, పంట బీమా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సులభంగా అందుతాయని తెలిపారు. ఏవైనా పొరపాట్లు ఉంటే సంబంధిత రెవెన్యూ కార్యాలయాల్లో సవరణ చేయించుకోవాలని రైతులకు సూచించారు.
చంద్రగిరి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. గతంలో భూ సంబంధిత సమస్యల వల్ల రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారంగా “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని తెలిపారు. చంద్రగిరి మండలంలోని నరసింగాపురం గ్రామంలో రీ సర్వే పూర్తి చేసిన 113 మందికి రాజముద్ర తో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. రీ సర్వే ద్వారా భూ వివాదాలు తొలగిపోతాయని రైతులకు తమ భూమిపై పూర్తి హక్కులు లభిస్తాయి అని అన్నారు. రీ సర్వే ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగినదని రైతులు తమ భూముల వివరాలు క్షేత్రస్థాయిలో సరి చూసుకోవాలని తెలిపారు..
డిఆర్ఓ మాట్లాడుతూ… గత ప్రభుత్వము జారీ చేసిన పాత పుస్తకం స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలను ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం నరసింగాపురం గ్రామ రైతులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రైతు యొక్క పాసు పుస్తకంలో వారి యొక్క సర్వే నెంబర్లు పేర్లు అన్ని కూడా క్షుణ్ణంగా ప్రింట్ చేసి ముద్రించడం జరిగిందని తెలిపారు. రీ సర్వే, పాసు పుస్తకంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఎమ్మార్వో , విఆర్వో దృష్టికి రైతులు తీసుకు వెళ్ళొచ్చని తెలిపారు. పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు సులభతర స్థాయిలో రెవెన్యూ సేవలు రైతులకు అందుబాటులో ఉంటాయి అని అన్నారు.
ఈ కార్యక్రమం అనంతరం ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ , ఎమ్మెల్యే, డి ఆర్ ఓ, ఆర్ డి ఓ రైతులకు పట్టాదారు పాసు పుస్తకములు పంపిణీ చేయడం జరిగింది…
ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ. రామ్మోహన్, చంద్రగిరి తహసీల్దార్ శివరాం సుబ్బయ్య, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
—————————————
డి ఐ పి ఆర్ ఓ, తిరుపతి
