Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి,విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న- తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి

*సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి,విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న- తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి*

👉🏻 దేశంలో మహిళా విద్యకు, సామాజిక సమానత్వానికి పునాదులు వేసిన విద్యదాత ,భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం స్థానిక మహిళా యూనివర్సిటీ దగ్గర బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో నేడు అత్యంత వైభవంగా జరిగింది.

 

👉🏻 ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని, స్థానిక కూటమి నాయకులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

 

👉🏻 ఈ సందర్భంగా డాలర్స్ దివాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ “అనేక అవమానాలను ఎదుర్కొని మహిళలకు చదువు నేర్పించిన సావిత్రిబాయి పూలే గారు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత,ఆమె కృషి వల్లే నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.”

 

👉🏻 విగ్రహాలను ఆవిష్కరించడమే కాకుండా, ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో పాటించాలని పిలుపునిచ్చారు.

 

👉🏻 విద్య మరియు సామాజిక న్యాయం పట్ల మన ప్రభుత్వం కట్టుబడి ఉందని, అణగారిన వర్గాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పరసా రత్నం, యాదవ కార్పొరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ యాదవ్, ఆంధ్ర ప్రదేశ్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ,తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు,పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్, ఎమ్మెల్సి సిపాయి సుబ్రమణ్యం,తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, తిరుపతి బీజేపీ ఇంచార్జి సామాంచి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ ఆర్ సి మునికృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, బీసీ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Related posts

గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు, దూసుకొస్తున్న ‘‘మొంథా’’ తుపాను

Garuda Telugu News

ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకొని ప్రజల కోరికను నెరవేర్చండి

Garuda Telugu News

చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పులివర్తి నాని , తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగు దేశం పార్టీ రాష్ట్ర నాయకులు బిరుదాల భాస్కర్ రెడ్డి……

Garuda Telugu News

Leave a Comment