Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

జనవరి 4న శ్రీవారి ప్రణయకలహోత్సవం

జనవరి 4న శ్రీవారి ప్రణయకలహోత్సవం

తిరుమల, 2026 జనవరి 03: శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన దేవేరులతో క‌లిసి పాల్గొనే కలహ శృంగార భరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 4వ తేదీ తిరుమలలో జరుగనుంది.

 

ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4 గంట‌లకు స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వ‌ద్ద‌ ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు పూల‌ బంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుండి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయకలహ మహోత్సవం నిర్వహిస్తారు.

 

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

Related posts

సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు..

Garuda Telugu News

శ్రీ పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం హుండీల ద్వారా రూ.9,34,990/-, అన్నదానం హుండీ ద్వారా రూ.1,39,700/- లు మరియు విదేశీ కరెన్సీ ద్వారా 20 నోట్లు ఆదాయం.

Garuda Telugu News

ఆర్టీసీ బస్సులో 3 సవరములు బంగారం, 5 వేలు నగదు పోగొట్టుకున్న మహిళ

Garuda Telugu News

Leave a Comment