Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

మత్తేరిమిట్ట *బాబు రెడ్డి* తాతగారి మృతి పట్ల *శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారు* సంతాపం

మత్తేరిమిట్ట *బాబు రెడ్డి* తాతగారి మృతి పట్ల *శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారు* సంతాపం

వరదయ్యపాలెం మండలం, మతేరిమిట్ట గ్రామానికి చెందిన టీడీపీ గ్రామ అధ్యక్షులు *బాబు రెడ్డి గారి* తాతగారు *రాధ రెడ్డి గారు* ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారు, నేడు మెతేరిమిట్టలోని బాబు రెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ముందుగా మరణించిన రాధ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం బాబు రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కూరపాటి శంకర్ రెడ్డి గారు మాట్లాడుతూ… కుటుంబ పెద్దను కోల్పోవడం తీరని లోటని, ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుఖః సమయంలో బాబు రెడ్డి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.

 

ఈ కార్యక్రమంలో శంకర్ గారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు *పిన్నమరెడ్డి యుగంధర్ రెడ్డి*, కుమార్ రెడ్డి, ఉమాపతి, క్లస్టర్ ఇంచార్జులు నిర్మల్ కుమార్, నాగరాజు, నాయకులు కువ్వకొల్లి ప్రసాద్ రెడ్డి, కడూరు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్యే గారిచే హాస్టల్ వీధి సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ

Garuda Telugu News

తొలి 15 వేగవంతమైన అర్ధశతకాల్లో 6 అతడి పేరిటే..!

Garuda Telugu News

సూళ్లూరుపేట లో రేపు విద్యుత్ అంతరాయం

Garuda Telugu News

Leave a Comment