Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

వృద్ధులకు దుప్పట్లు పంపిణీ 

వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

నూతన సంవత్సరo సందర్భంగా బిఈపిసి ఫౌండేషన్ తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం గోపాల్ రావు గిరిజన కాలనీలోని 25 మంది వృద్ధులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక తాసిల్దార్ సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున వృద్ధుల కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న ఫౌండేషన్ సభ్యులు రియాజ్ ను ఆయన అభినందించారు .అలాగే స్థానికంగా ఉన్న యువత ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అయి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన కోరారు. అనంతరం వరదయ్యపాలెం పంచాయతీ సెక్రటరీ బసిరెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిఈపిసి ఫౌండేషన్ ను ఆయన అభినందించారూ . రియాజ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకారం అందించిన దాతలకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి, విఆర్ఓ కిరణ్, బిఈపిసి సభ్యులు అబ్దుల్లా, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పూతలపట్టు నియోజకవర్గం ప్రజలకు విన్నపం….

Garuda Telugu News

మొంథా తుఫాను ప్రభావం వలన జరిగిన నష్టం అంచనా సమగ్ర నివేదికను

Garuda Telugu News

సత్యవేడు రెవిన్యూ డిజిజన్ ఏర్పాటు చేయండి

Garuda Telugu News

Leave a Comment