Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

టీటీడీ ట్రస్టులకి రూ. 20 లక్షలు విరాళం

టీటీడీ ట్రస్టులకి రూ. 20 లక్షలు విరాళం

తిరుమల, జనవరి 2 : తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టులకి హైదరాబాద్ కు చెందిన రెండు సంస్థలు రూ. 20 లక్షలు టీటీడీకి విరాళం అందజేశారు. హైదరాబాద్ కు చెందిన రైడాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో వంగల హర్షవర్ధన్

రూ.10,00 000 శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ కు, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జాయింట్ డైరెక్టర్ నేలబొట్ల శుభ సౌజన్య రూ. 10,00,000లు శ్రీ బాలాజీ ఆరోగ్యం వరప్రసాద్ ని ట్రస్టుకు కేటాయించారు. ఈ మేరకు 20 లక్షల రూపాయల చెక్కులను ఆ సంస్థల ప్రతినిధి, తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ చేతుల మీదుగా శుక్రవారం టిటిడి చైర్మన్ బి.ఆర్. నాయుడు ను ఆయన కార్యాలయంలో కలిసి అందజేశారు. టీటీడీకి విరాళం అందించడం పట్ల టిటిడి చైర్మన్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కుప్పాల గిరిధర్ ను అభినందించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై అచంచలమైన భక్తి శ్వాసాలతో టీటీడీ ట్రస్టులకు భక్తులు విరాళాలు అందించడం పట్ల బి ఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

Related posts

టిడిపి నేత మనోహర్ బౌతికకాయానికి ఎమ్మెల్యే ఆదిమూలం నివాళి

Garuda Telugu News

వసుంధర జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన మేయర్ డాక్టర్ శిరీష  

Garuda Telugu News

తెలుగు దేశం పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారి” ఆధ్వర్యంలో

Garuda Telugu News

Leave a Comment