Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

నూతన సంవత్సర సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,

తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.

– నూతన సంవత్సర సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు కుటుంబ సభ్యులతో కలిసి జీవకోనలో రైజ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాథ శరణాలయాన్ని సందర్శించారు.

 

– ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థలో నివసిస్తున్న విద్యార్థులతో కలిసి వారి చేత కేక్ కట్ చేయించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే విద్యార్థినులకు టవల్స్, నోట్‌బుక్స్, సబ్బులు, స్టేషనరీ సామగ్రిని అందజేశారు. జిల్లా ఎస్పీ గారు స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి హాజరవడం పట్ల నిర్వాహకులు మరియు విద్యార్థినులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 

– ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు మాట్లాడుతూ,“పుట్టుకతో ఎవరూ అనాధలు కారు. నిజంగా అనాధలు అనేవారు తమ బాధ్యతలను వదిలేసిన వారే” అని పేర్కొన్నారు. సమాజం పిల్లల భవిష్యత్తుపట్ల మరింత బాధ్యతతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు.

 

– ఈ కార్యక్రమంలో అలిపిరి సీఐ రామ్ కిషోర్ ఎస్సైలు మరియు సిబ్బంది శరణాలయం సిబ్బంది పాల్గొన్నారు

Related posts

👆భారీ వర్షానికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Garuda Telugu News

గర్జించిన పాత్రికేయులు..!

Garuda Telugu News

ఢిల్లీలో బీజేపీ విజయం ప్రాంతీయ పార్టీల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోందా?

Garuda Telugu News

Leave a Comment