Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తి వైయస్సార్సీపీ కార్యాలయంలో కాటంరెడ్డి శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు గారి జన్మదిన వేడుకలు అటహాసంగా జరిగాయి

శ్రీకాళహస్తి వైయస్సార్సీపీ కార్యాలయంలో కాటంరెడ్డి శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు గారి జన్మదిన వేడుకలు అటహాసంగా జరిగాయి

శ్రీకాళహస్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె కాటంరెడ్డి శ్రీపవిత్ర రెడ్డి బియ్యపు గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.

ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయింది. పండుగ వాతావరణం నెలకొన్న ఈ వేడుకల్లో నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళా ప్రతినిధులు భారీ ఎత్తున తరలివచ్చారు.

 

కార్యకర్తల కోలాహలం మధ్య శ్రీపవిత్ర రెడ్డి గారు కేక్ కట్ చేసి తన పుట్టినరోజు జరుపుకున్నారు.వైఎస్సార్సీపీ నాయకులు ఆమెకు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.పార్టీ పెద్దలు మరియు సీనియర్ నాయకులు శ్రీపవిత్ర రెడ్డి గారు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు.

 

బియ్యపు మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వంపై ఉన్న అభిమానాన్ని చాటుతూ, కార్యకర్తలు జై బియ్యపు మధుసూదన్ రెడ్డి నినాదాలతో కార్యాలయాన్ని హోరెత్తించారు.

 

అనంతరం శ్రీపవిత్ర రెడ్డి గారు తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Related posts

రెండో దశ భూసమీకరణ – రైతుల నమ్మకమే అమరావతికి రక్ష!

Garuda Telugu News

శ్రీవారి మెట్టు మార్గంలో 1150 మెట్ల వద్ద నల్గొండ వాసి ఫిట్స్ రావడంతో అస్వసతకు గురయ్యాడు

Garuda Telugu News

శ్రీ శ్రీదేవి శ్రీ భూదేవి శ్రీ యోగ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయములో గోమాత పూజ

Garuda Telugu News

Leave a Comment