టిటిడి ఈఓ ను కలసిన టిడిపి నేతలు
తిరుపతి, జనవరి 1 :

ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకొని గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, జిల్లా నేతలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం టిటిడి పరిపాలన భవనంలో ఈవోను కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేతలు సూరా సుధాకర్ రెడ్డి, పుష్పావతి యాదవ్, బుల్లెట్ రమణ, డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, బిజె కృష్ణ యాదవ్, మైనం బాలాజీ నాయుడు లు ఉన్నారు. అంతకుముందు వీరంతా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడులను కలిసి సాలువులతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంచి పరిపాలన దక్షత కలిగిన అధికారులని కొనియాడారు.
