Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జర్నలిస్టులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం.*

పత్రికా ప్రకటన

 

👉 *శ్రీకాకుళం జర్నలిస్టులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం.*

👉 *ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల రక్షణ కొరకు హెల్మెట్ల పంపిణీ.*

 

👉 *కుటుంబ రక్షణే..ప్రతి ఒక్కరి ధ్యేయం..బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర.*

 

👉 *ప్రతి ఒక్కరు హెల్మెట్లు ధరించి వాహనాలు నడపండి..సామాజికవేత్త డా || సూర శ్రీనివాసరావు.*

 

👉 *మీ భద్రత..కుటుంబానికి రక్ష…హెల్మెట్ ధరిస్తే శ్రీరామరక్ష..ప్రముఖ హీరో షకలక శంకర్.*

 

శ్రీకాకుళం: నూతన సంవత్సరం సందర్భంగా 2026 జర్నలిస్టుల సురక్షితమైన ప్రయాణం మీ కుటుంబ భద్రత.. దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా శాఖ సుమారు వందమంది జర్నలిస్టులకు హెల్మెట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నగర జర్నలిస్టులతో పాటు నియోజకవర్గ జర్నలిస్టులకు సుమారు వందమందికి ఈ హెల్మెట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సామాజిక వేత్త, వ్యాపారవేత్త డా సూర శ్రీనివాస రావు తో పాటు, అనునిత్యం మహిళా భద్రత ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు సమస్యలలోనూ తన పార్టీ తరఫున యువ నాయకత్వాన్ని భుజాలకి ఎత్తుకున్న బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూర ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా ప్రత్యేక ఆకర్షణ అయితే మన శ్రీకాకుళం జిల్లా వాసి శ్రీకాకుళం నీకే గుర్తింప తెచ్చిన హీరో షకలక శంకర్ ఈ సామాజిక కార్యక్రమంలో భద్రత మన హక్కు అనే నినాదంతో జర్నలిస్టుల రక్షణ కొరకు తన చేతుల మీదగా హెల్మెట్ల పంపండి కార్యక్రమమునకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దీనిపై జర్నలిస్టుల రక్షణ దేశ పురోగతికిమూలమంటూ ఈ జర్నలిస్టులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఓ బాధ్యతగా తీసుకొని ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ముందుగా కార్యవర్గానికి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గానికి అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా కార్యవర్గానికి డా సూర శ్రీనివాస్ రావు అభినందనలు తెలిపారు. అదేవిధంగా పైడి సింధూర మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో మహిళా జర్నలిస్టులు తమ వాహనాలపై బాధ్యతగా మెలగాలని హెల్మెట్లు ధరించి వాహనాన్ని నడిపి కుటుంబ సంక్షేమానికి వాళ్ల వంతుగా కృషి చేస్తే ప్రయాణం సాఫీగా జరుగుతుందని, కాబట్టి ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించిన డా||డోల అప్పన్న, డా||తిత్తి ప్రవీణ్ కుమార్, అధ్యక్షులు పేడాడ హేమ సుందర్, ఆకుల మాధవ్, అద్దంకి సురేష్, ఆర్ వి పట్నాయక్, బొడ్డేపల్లి రాజేష్, వి రాము, జామి శ్రీనివాసరావు, గుండబాల మోహన్ లకు అభినందనలు తెలిపారు. అంతేకాకుండా సినీ హీరో షకలక శంకర్ ఎంతటి చక్కటి సామాజిక కార్యక్రమంలో నన్ను బాగాస్తుడిని చేసి ప్రజా శ్రేయస్సు కొరకు నా వంతుగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన జర్నలిస్టు సంఘాల మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నగర జర్నలిస్టులతో పాటు చాలామంది సీనియర్ జర్నలిస్టులో పాల్గొనడం ఈ సామాజిక కార్యక్రమానికి నూతన సంవత్సరం ఓ నాందిలా పలికిందని తెలిపారు.

Related posts

ప్రజల నుండి వచ్చే వినతులు త్వరితగతిన పరిష్కరించండి

Garuda Telugu News

సమస్య మీది పరిష్కరించే బాధ్యత నాది 

Garuda Telugu News

*ఏపీలో ఉచిత బస్సు.. ఉగాదికి ఫిక్స్!

Garuda Telugu News

Leave a Comment