*పరిటాల సునీత మరిదికి (చెల్లెలు భర్త) కన్నీటి వీడ్కోలు*

*అమెరికాలో గుండెపోటుతో మృతి చెందిన గుంటూరు రామాంజనేయులు*
*గురువారం ఉదయం బెంగళూరుకు పార్థివదేవం, అక్కడే అంత్యక్రియలు*
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మరిది (చెల్లెలు భర్త) గుంటూరు రామాంజనేయులుకి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆత్మకూరు మండలం, పి.సిద్దరాంపురం గ్రామానికి చెందిన గుంటూరు రామాంజనేయులు గత నెల 24వ తేదిన అమెరికాలో గుండెపోటుతో మరణించారు. పరిటాల సునీత చెల్లెలు లక్ష్మీ భర్త అయిన రామాంజనేయులు దంపతులు బెంగళూరులో స్థిరపడ్డారు. వారి పెద్ద కుమారుడు మంజునాథ్ కు ఇటీవల కుమారుడు జన్మించగా గత నెల 13వ తేదీన రామాంజనేయులు దంపతులు అమెరికా వెళ్లారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా గడుపుతున్న సమయంలో.. రామాంజనేయులు 24వ తేదీ హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. అమెరికా నుంచి రామాంజినేయులు పార్థివదేహం గురువారం తెల్లవారుజామున బెంగళూరులోని కెంపాపుర లోని రాయల్ ఎన్ క్లేవ్ లే అవుట్ లో ఉన్న ఆయన నివాసానికి చేరుకుంది. అక్కడ ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటు ధర్మవరం తెదేపా ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ నివాళులర్పించారు. రామాంజనేయులుతో ఉన్న అనుబంధాన్ని వారు గుర్తు చేసుకున్నారు. వీరితో పాటు పరిటాల, ధర్మవరపు, గుంటూరు వారి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు తరలివచ్చి ఆయనకు నివాళులర్పించారు. అనంతరం మధ్యాహ్నం 12గంటలకు హెబ్బాల్ సమీపంలోని ఎస్టీమ్ మాల్ ప్రక్కన ఉన్న హిందూ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు….
