💥*65 మంది *తొలి అడుగు ఉత్తమ అవార్డు** *షీల్డ్ లను బహూకరించిన సత్యవేడు నియోజకవర్గం ఇంచార్జ్ శంకర్ రెడ్డి.*💥

👉సత్యవేడు నియోజకవర్గంలోని 7. మండలాలకు చెందిన సామాజిక సేవల రంగంలో అత్యంత విశిష్ట కృషిని గుర్తించి ఇచ్చే తొలి అడుగు ఉత్తమ అవార్డు షీల్డ్ లను *టిడిపి కార్యకర్తలు **65 మందికి* సత్యవేడు నియోజకవర్గం ఇంచార్జ్ *శంకర్ రెడ్డి*గారు చేతుల మీదుగా బహుకరించారు .
✌️తిరుపతి పట్టణంలోని *కె ఎస్ ఆర్ కళ్యాణ* మండపంలో అట్టహాసంగా జరిగిన సామాజిక సేవ రంగంలో కృషి చేసినటువంటి టిడిపి శ్రేణులకు షీల్డ్ బహుకరించారు *శంకర్ రెడ్డి* గారు. ఈ సందర్భంగా *శంకర్ రెడ్డి* గారు మాట్లాడుతూ…. ఏడు మండలాల్లో 65 మందికి తొలి అడుగు ఉత్తమ అవార్డులు నా చేతుల మీదుగా షీల్డ్ ను అందించడం చాలా సంతోషంగా ఉందని వచ్చే పర్యాయం ఏడు మండలాల్లో చేరి తోలి అడుగు ఉత్తమ అవార్డులు సుమారు 1000 మందికి ఇచ్చే విధంగా గ్రామాల్లో సేవలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఆ విధంగా టిడిపి కార్యకర్తలు ముందుకు వెళ్లాలని అలాగే ప్రజలతో మమేకమై ప్రభుత్వ పరంగా వారి అందవలసిన ప్రభుత్వ పథకాలు చేరే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా పార్టీ శ్రేణులకు ఎంతైనా అవసరం ఉందని అప్పుడే టిడిపి పార్టీకి ప్రజలు అండదండలు ఉంటాయని ఇది ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలంటు సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జ్ *కూరపాటి శంకర్ రెడ్డి* గారు పేర్కొన్నారు.
