*శ్రీవారి సేవలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు
తిరుమల -01-01-26

2026 ఆంగ్ల సంవత్సరాది నేపథ్యంలో గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని, చిత్తూరు పార్లమెంటు సభ్యులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు, తెలుగు దేశం పార్టీ చిత్తూరు పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ చౌదరి గారు విఐపి బిగినింగ్ బ్రేక్ లో దర్శించి, మొక్కలు చెల్లించుకున్నారు. 2026 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతా మంచి జరగాలని, సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థించినట్లు చెప్పారు చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు.
