Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఎస్బిఐ ద్వారా రైతులకు చేయూత

*ఎస్బిఐ ద్వారా రైతులకు చేయూత*

✍️ *రైతులు బ్యాంకు లను సద్వినియోగం చేసుకోండి*

✍️ *ఎస్బిఐ చీఫ్ మేనేజర్ దేవ ప్రసాద్*

✍️ *ఎస్బిఐ ద్వారా అన్నీ రకాల రుణాలు అందిస్తాం : బ్రాంచ్ మేనేజర్ అంజద్ అలీ*

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ రుణాల ద్వారా రైతులకు చేయూతనందిస్తుందని ఎస్బిఐ చీఫ్ మేనేజర్ ఎం. దేవ ప్రసాద్ పేర్కొన్నారు.

జాతీయ రైతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం సాయంత్రం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో రైతులకు ఎస్బిఐ అందించే రుణాలు పై అవగాహన సమావేశం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న చీఫ్ మేనేజర్ దేవ ప్రసాద్ మాట్లాడుతూ డ్రిప్, రెయిన్ గన్, స్పింకర్లు, పాల ఉత్పత్తి, డైరీ వంటి రకరకాల రుణాలు తన బ్యాంకు అందిస్తుందన్నారు.

ఆధునిక సాంకేతికతను వినియోగించి లాభదాయకమైన వ్యవసాయం చేయడానికి రైతులకు తమ సంస్థ రుణాలు అందిస్తుందని, వాటికి ప్రభుత్వం నుండి సబ్సిడీ వస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

పిచ్చాటూరు బ్రాంచ్ మేనేజర్ బి.అంజద్ అలీ మాట్లాడుతూ రైతులు ఎస్బిఐ ద్వారా వివిధ రుణాలు పొందడానికి అన్నీ విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

పూర్తి వివరాలకు స్థానిక ఎస్బిఐ బ్రాంచ్ ను సంప్రదించాలని ఆయన వెల్లడించారు.

అలాగే రుణాలు తీసుకునే రైతులు వాటికి ఎస్బిఐ ఇన్సూరెన్స్ పాలసీలు చేసుకోవడం వల్ల రిస్క్ ఏమైనా జరిగితే పెద్ద మొత్తంలో డబ్బులు పొందవచ్చని, లేకుంటే మీరు కట్టే డబ్బులు ప్రీమియం కాలం పూర్తయిన వెంటనే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ఎస్బిఐ లైఫ్ మేనేజర్ ఈ. రాజేష్ కుమార్ వివరించారు.

అనంతరం బ్యాంక్ అధికారులు, రైతుల సందేహాలను నివృత్తి చేయడం తో పాటు పలు సలహాలు, సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ బి.అంజద్ అలీ, ఆర్బీఓ మేనేజర్ ఎం.హరి ప్రసాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కోట వినుత డ్రైవర్‌ హత్యకేసులో మరో ట్విస్ట్.. ప్రకంపనలు సృష్టిస్తున్న వీడియో..!!

Garuda Telugu News

ఈ – ఆటోలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్

Garuda Telugu News

భోగాపురం ఎయిర్ పోర్టులో విమానం టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ‌డం హ‌ర్ష‌నీయం

Garuda Telugu News

Leave a Comment