*🟨రెవెన్యూ సేవలు మరింత సులభతరం కావాలి*

*🟩రెవెన్యూశాఖపై అధికారులను ఆరా తీసిన సీఎం*
*🟨ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన అసైన్డ్ భూములు, రీ సర్వేలపై ప్రధానంగా సాగిన చర్చ*
*🟩వేగవంతమైన ఆటోమ్యూటేషన్ ప్రక్రియ చేపట్టాలని సూచన*
*🟨పట్టాదారు పాస్ పుస్తకాలు సహా అన్నింటా రియల్ టైమ్‌లో ఆటో మ్యుటేషన్ విధానాన్ని అమలు*
*🟩రెవెన్యూ శాఖలో ఏడాదిలోగా పూర్తి ప్రక్షాళన జరగాలన్న సీఎం*
*🟨పీజీఆర్ఎస్‌లో మ్యుటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి 1,97,915 ఫిర్యాదులు*
*🟩రానున్న 2027 డిసెంబరు నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తి : సీఎం చంద్రబాబు*
*🟨ఫ్రీ హోల్డ్ భూములపై జాగ్రత్త అవసరం*
*🟩 22ఏ ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి*
*🟨చుక్కల భూములను 22ఏ జాబితా నుంచి తొలిగించే ప్రక్రియను వేగవంతం చేయాలి: సీఎం*
*🟩జేసీలు లేని జిల్లాలకు వెంటనే జేసీలను నియమకం: మంత్రి అనగాని సత్యప్రసాద్*
*🟨 26 జిల్లాల్లోనూ రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసమే జేసీలు పని చేయాలి: సీఎం స్పష్టం*
*🟩ఇకపై వివాదాస్పద భూములుగా పరిష్కరించే అధికారం ఆర్డీవోలకు :సియం నిర్దేశం*
ఏపీలో రెవెన్యూ సేవలు మరింత సులభతరం కావాలని, చిక్కుముడులు లేకుండా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రెవెన్యూశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం పట్టాదారు పాస్ పుస్తకాలు సహా అన్నింటా రియల్ టైమ్‌లో ఆటో మ్యుటేషన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థగా అవతరించాలని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. అవినీతి, అక్రమాలకు తావులేకుండా పాస్పోర్ట్ కార్యాలయాల తరహాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తీసుకురావాలని సీఎం దిశానిర్దేశం చేశారు.*
*రెవెన్యూ శాఖపై సీఎం సమీక్ష: అమరావతి సచివాలయంలో రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు మంత్రి అనగాని సత్యప్రసాద్, ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఆటోమ్యూటేషన్ జరిగేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని సీఎం స్పష్టం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం భూ యజమానులు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదని తెలిపారు. రెవెన్యూ శాఖలో ఏడాదిలోగా పూర్తి ప్రక్షాళన జరగాలన్న సీఎం, దీనిపై ప్రతీనెలా సమీక్షిస్తానని వెల్లడించారు.*
*పీజీఆర్ఎస్‌లో మ్యుటేషన్, పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి 1,97,915 ఫిర్యాదులు వచ్చాయని సమావేశంలో అధికారులు చంద్రబాబుకి తెలిపారు. ల్యాండ్ నేచర్, క్లాసిఫికేషన్ సంబంధిత వివాదాల దరఖాస్తులు 1,00,835, రీసర్వే అనంతరం భూమి తగ్గిందని వచ్చిన పీజీఆర్ఎస్ దరఖాస్తులు 1,00,295, జాయింట్ ఎల్‌పీఎంలపై 2,40,479 ఫిర్యాదులు నమోదైనట్టు వివరించారు.*
*అస్తవ్యస్తం చేసిన గత పాలకులు: అదే విధంగా వెబ్ ల్యాండ్లో ఏ మార్పు జరిగినా అది ఆన్లైన్లో శాశ్వతంగా నిక్షిప్తం అయ్యే వ్యవస్థ తీసుకొస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గత పాలకులు చేసిన పాపాల వల్లే రెవెన్యూ సమస్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. ఏడాదిన్నరగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాపాలు కడిగేందుకు కృషి చేస్తున్నందు వల్లే ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయామని వివరించారు. దోచుకునేందుకు గత పాలకులు అస్తవ్యస్తం చేసిన విధానాలు ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తున్నాయని తెలిపారు.*
*రానున్న 2027 డిసెంబరు నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రతీ నెలా రీసర్వే పురోగతిపై నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. జాయింట్ లాండ్ పార్సెల్ మ్యాప్స్ వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలని, భూమి వివరాలు డేటా బేస్ ఆన్‌లైన్‌లో ఉంటే ఈసీ జారీ చేయడం సులభమవుతుందని సీఎం అన్నారు. 22ఏ జాబితా నుంచి తొలగించాలని వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని సూచించారు.*
*ఫ్రీ హోల్డ్ భూములపై జాగ్రత్త అవసరం: అంతేకాకుండా 22ఏ ఫ్రీ హోల్డ్ భూముల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. డాక్యుమెంట్ల వివరాలను ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చెయిన్ లాంటి పటిష్ట వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. భూముల వివరాలు అన్నీ పారదర్శకంగా ఆన్‌లైన్‌లో ఉంచితే వివాదాలు తలెత్తవని సూచించారు. వివాదాస్పద భూములుగా పరిగణించడం, వాటిని తొలగించడం వంటి అధికారం ఇన్నాళ్లూ జాయింట్ కలెక్టర్‌కు ఉండగా ఇకపై వివాదాస్పద భూములుగా పరిష్కరించే అధికారం ఆర్డీవోలకు ఇవ్వాలని నిర్దేశించారు.*
*చుక్కల భూములను 22ఏ జాబితా నుంచి తొలిగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం అన్నారు. 1999 వరకూ ప్రాథమిక సహకార సంఘాల వద్ద తాకట్టు పెట్టిన అసైన్డ్ భూములు కూడా 22ఏ జాబితా నుంచి తొలిగించాలని వివరించారు. బంజరు భూములు 1954 కంటే ముందు సేల్ డీడ్స్ రిజిస్టర్ ఆఫ్ హోల్డింగ్స్‌ను 22ఏ నుంచి తొలగించాలని చెప్పారు.*
*సీఎం ఆదేశాల మేరకు జేసీలు లేని జిల్లాలకు వెంటనే జేసీలను నియమించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. 26 జిల్లాల్లోనూ రెవెన్యూ సమస్యలు పరిష్కారం కోసమే జేసీలు పని చేయాలని సీఎం స్పష్టం చేశారన్నారు. భూ సమస్యలన్నింటికీ ఇక జేసీలదే బాధ్యత అని స్పష్టం చేశారు.*
*కార్యాచరణ రూపొందించాలని స్పష్టం: మున్సిపల్ పరిధిలో ఉన్న అసైన్డ్ భూములు మంత్రుల కమిటీ సిఫార్సు మేరకు 250 చదరపు గజాల లోపు స్థలాల్ని 50 శాతం బేస్ వాల్యూతో రెగ్యులరైజ్ చేయాలని సీఎం ఆదేశించారు. ఆక్వా కల్చర్ చేస్తున్న అసైన్డ్ భూముల్ని సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు. 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్ధులకు కుల ధృవీకరణ పత్రం వెంటనే పొందేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు.*
*ఆర్టీజీఎస్‌తో అనుసంధానించిన సమాచారం ద్వారా ఆదాయ ధృవపత్రం ఇవ్వాలని వివరించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో 10,169 కోట్ల రెవెన్యూ లక్షంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మార్కెట్ విలువలతో భూమి విలువలు అప్ గ్రేడ్ చేయాలని సీఎం స్పష్టం చేశారు. గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ వరకు రెవెన్యూ శాఖకు 5,28,217 గ్రీవెన్సులు రాగా, వాటిలో 4,55,189 అంటే 86 శాతం గ్రీవెన్సులు పరిష్కారమయ్యాయని అధికారులు తెలిపారు.*
*పరిశీలనలో మరో 73 వేల వరకు గ్రీవెన్సులు ఉన్నాయని, ఎవరైనా అర్జీల పరిష్కారంపై అసంతృప్తి వ్యక్తం చేస్తే ఆ ఫిర్యాదులను తిరిగి పరిశీలన చేస్తున్నట్టు అధికారులు సీఎం కి వివరించారు. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు 22ఏ జాబితా నుంచి తమ భూముల వివరాలు తప్పించాలని కోరుతూ 6,846 దరఖాస్తులు దాఖలు రాగా ఎక్స్ సర్వీస్‌మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్య్ర సమరయోధులు, 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగిన వాళ్ల భూములు మాత్రం 22ఏ నుంచి తొలిగించనున్నట్టు అధికారులు సీఎంకి తెలిపారు.*
*ఈ ఆర్ధిక సంవత్సరం స్టాంప్, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 10,169 కోట్ల ఆదాయం ఆర్జించడమే లక్ష్యమని అధికారులకు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా 430 రియల్ ఎస్టేట్ వెంచర్లను గుర్తించి, ఆయా ప్లాట్లకు సంబంధించి యూజర్ ఫ్రెండ్లీ రిజిస్టేషన్‌కు కార్యాచరణ చేపట్టాలని పేర్కొన్నారు. దీంతో 15,570 రిజిస్ట్రేషన్లతో రూ.250 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని అధికారులకు సీఎం చంద్రబాబు వివరించారు.*
*”వేరే దేశాల్లో రిజిస్ట్రేషన్ విధానాలను అధ్యయనం చేసి సమగ్రమైన రెవెన్యూ విధానాన్ని అవలంభిస్తాం. వెబ్ల్యాండ్లో ఏ మార్పు జరిగినా అది ఆన్లైన్లో శాశ్వతంగా నిక్షిప్తం అయ్యే వ్యవస్థ తీసుకొస్తున్నాం. గత వైఎస్సార్సీపీ పాలకులు అస్తవ్యస్తం చేసిన విధానాలు ఇప్పుడిప్పుడే ఓ కొలిక్కి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో రెవెన్యూ శాఖను అన్ని విధాలా ప్రక్షాళన చేస్తాం”-అనగాని సత్యప్రసాద్,మంత్రి*
