Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

దీర్ఘకాలిక పన్ను బకాయిదారులకు రెడ్ నోటీసులు ఇవ్వండి…

దీర్ఘకాలిక పన్ను బకాయిదారులకు రెడ్ నోటీసులు ఇవ్వండి.

*కమిషనర్ ఎన్. మౌర్య.*

నగరంలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పన్ను బకాయిదారులకు రెడ్ నోటీసులు ఇచ్చి వసూలు చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య రెవిన్యూ అధికారులను ఆదేశించారు. పన్నుల వసూళ్లు తదితర అంశాలపై బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో రెవిన్యూ అధికారులు, సచివాలయ కార్యదర్సులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా వార్డుల పరిధిలో పన్నుల వసూళ్లపై అధికారులు వివరించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పలు వార్డుల్లో దీర్ఘకాలింగా ఉన్న పెండింగ్లో ఉన్న వాటిని గుర్తించి రెడ్ నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అప్పటికి స్పందించని వారి కొళాయి, డైనేజీ కనెక్షన్లు కట్ చేయాలని అధికారులను ఆదేశించారు. సచివాలయ కార్యదర్సులు తమ వార్డుల పరిధిలో అన్ని తనిఖీ చేయాలని అన్నారు. ప్రభుత్వ ఆస్తుల బకాయిలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆస్తి పన్నుతో పాటు అన్ని రకాల పన్నులు సకాలంలో వసూలు చేయాలని తెలిపారు. విధి నిర్వహణలో అందరూ సక్రమంగా ఉండాలని, ఎటువంటి సమస్యలు ఉన్నా పై అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు. పన్నులు వసూళ్లలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, రెవిన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, వివిధ కార్యదర్సులు పాల్గొన్నారు.

Related posts

చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఆ పార్టీలో చేరతారా?

Garuda Telugu News

వరదయ్యపాలెం మండల ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

Garuda Telugu News

స్క్రబ్ టైఫస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి – ఎంపీ గురుమూర్తి

Garuda Telugu News

Leave a Comment