*తుఫాను బాధితులు అందరినీ ఆదుకుంటాం*

✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం*
✍️ *పాలమంగళంలో బియ్యం నిత్యావసర వస్తువులు పంపిణీ*
తుఫాను బాధితులు అందరినీ ఆదుకుంటామని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బరోసా కల్పించారు.
బుధవారం ఉదయం నారాయణవనం మండలం లోని పాలమంగళం లో బాధిత కుటుంబాలకు ఉచిత బియ్యం, నిత్యవసర వస్తువులను జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే ఆదిమూలం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తుఫాను సందర్భంగా వరదలో నీట మునిగిన కుటుంబాలు, చేనేత కార్మికులు, మత్స్య కార్మికులను ప్రభుత్వం ద్వారా ఆదుకుంటున్నామన్నారు.
ఇంకా ఎవరికైనా ప్రభుత్వ సాయం అందకుంటే తమ దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారికి సాయం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.
వీటితోపాటు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి పట్టాలు పంపిణీ, స్థలం ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేని వారికి ఎన్టీఆర్ గృహకల్ప పథకం ద్వారా ప్రభుత్వం సాయం అందిస్తుందని ఎమ్మెల్యే వివరించారు.
ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ ఫైనాన్స్ కమిటీ సభ్యులు కోనేటి సుమన్ కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
