గ్యాస్ బిల్ అమౌంటు కన్నా ఎక్కువగా వసూలు చేసే వారిపై చర్యలు

– జిల్లా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ ఎన్.మౌర్య
తిరుపతి గరుడ కలెక్టరేట్ న్యూస్
గ్యాస్ బిల్ అమౌంట్ కన్నా ఎక్కువగా వసూలు చేసే గ్యాస్ ఏజెన్సీ లపై చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ ఎన్.మౌర్య గ్యాస్ డీలర్లను హెచ్చరించారు. బుధవారం జిల్లా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య నగరపాలక సంస్థ కార్యాలయంలో జిల్లాలోని గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఐ వి ఆర్ ఎస్ పాజిటివ్ ప్రిస్క్రిప్షన్ సర్వే మీద మన జిల్లాలో 28 గ్యాస్ డీలర్ల పై ఎక్కువ పాజిటివ్ కాల్స్ వచ్చాయని అన్నారు. గ్యాస్ డీలర్లకు సంబంధించిన గ్యాస్ డెలివరీ బాయ్స్ గ్యాస్ డెలివరీ చేసినప్పుడు గ్యాస్ బిల్ అమౌంట్ కన్నా ఎక్కువగా వసూలు చేయుచున్నారని ఐవిఆర్ఎస్ రిపోర్ట్స్ లో పాజిటివ్గా వచ్చాయని, కావున మీ గ్యాస్ డెలివరీ బాయ్స్ కి నియమ నిబంధనలను పాటించేలా చూడాలన్నారు. ఇలాంటివి జిల్లాలో మరల పునరావృతం అయితే గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
