📍ప్రత్యేకంగా కమిటీ వేసి విచారణకు ఆదేశించాం.

ప్రయాణీకులకు అత్యవసరంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. మా మంత్రిత్వశాఖ పూర్తి దృష్టి ప్రయాణికులపైనే ఉంది. ఇండిగో కచ్చితంగా సమాధానం చెప్పాలి. FDTL నిబంధనలు అందరూ పాటిస్తున్నారు. పద్ధతుల్లో ఎలాంటి మార్పులు లేకుండా అమలు చేస్తున్నాం. రేపు రాత్రి 8 గంటలలోపు రీఫండ్ చేయాలని ఇండిగోను ఆదేశించాం. విమాన టికెట్ల ధరలు పెంచకూడదని ఆదేశాలు ఇచ్చాం. కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించాం : కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
