డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి
* వర్ధంతి వేడుకల్లో సత్యవేడు అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరమణ

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే ఆయనకు మనమిచ్చే ఘన నివాళని వర్ధంతి వేడుకల్లో సత్యవేడు అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరమణ తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని సత్యవేడు అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వెంకటరమణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహా నేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అన్నారు. అసమానతలు లేని సమసమాజ నిర్మాణాన్ని స్థాపించడానికి అంబేద్కర్ కృషి ఎనలేని కొనియాడారు. కుల మత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కలిగేలా రాజ్యాంగాన్ని నిర్మించారని పేర్కొన్నారు. కానీ ఈరోజు భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కుబేరులకు దోచిపెడుతోందన్నారు. రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు సమాన హక్కులు కల్పించవలసిన ప్రభుత్వాలు ధనికులకు ఒక న్యాయం సామాన్యులకు ఓ న్యా
