తిరుపతి జిల్లా పోలీస్ శాఖ..

– హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం – ప్రజాసేవలో హోంగార్డ్స్ సేవలు నిబద్ధతకు నిదర్శనం.
– తిరుపతి జిల్లా.. హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు పాల్గొని హోంగార్డ్స్ విధులు, వారి బాధ్యత మరియు ప్రజా భద్రతలో వారి పాత్రను మరోసారి స్పష్టంగా గుర్తుచేశారు.
– ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడం హోంగార్డ్స్ ప్రధాన లక్ష్యం కావాలని, ప్రతి సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధత, బాధ్యతను ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. హోంగార్డ్స్ అంటే తక్కువ కాదు, కానిస్టేబుల్ అంటే ఎక్కువ కాదు మనమందరం ఒకటే పోలీస్ కుటుంబం. మీ సేవలు అత్యంత విలువైనవి అని పేర్కొన్నారు.
– సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హోంగార్డ్స్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం మెడికల్ హెల్త్ క్యాంప్, శారీరక దృఢత్వం కోసం స్పోర్ట్స్ & గేమ్స్ నిర్వహించబడుతున్నాయని ఎస్పీ గారు తెలిపారు.
సిబ్బంది శారీరక–మానసిక ఆరోగ్యానికి యోగా, ధ్యానం, వ్యాయామాలు నిరంతరం అలవర్చుకోవాలని సూచించారు.
– విధి బాధ్యతలు భద్రతా నిబంధనలు ప్రతి హోంగార్డు తన బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తించి ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు.
ప్రయాణాలలో హెల్మెట్ తప్పనిసరి, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఎస్పీ గారు హెచ్చరించారు.
– భీమా పథకాలు భద్రత కోసం సిబ్బంది భవిష్యత్ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన వంటి పథకాలలో తప్పనిసరిగా చేరాలని సూచించారు.
– సిబ్బంది సమస్యలకు తక్షణ స్పందన డ్యూటీలో ఏ సమస్యలైనా ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలని, వాటి పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందనిఅలాగే సుదీర్ఘకాలం సేవలందించి పదవి విరమణ పొందే వారికి రోజు ప్రోత్సాహక నగదు అందిస్తామని ఎస్పీ గారు భరోసా ఇచ్చారు.
– విధినిర్వహణలో ప్రత్యేక ఉత్తమత ప్రతిభ కనపరిచిన హోంగార్డ్స్ సేవలను ప్రశంసిస్తూ,సిబ్బందికి ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట పురస్కారాలను ఎస్పీ గారు అందజేశారు.
– ఈ కార్యక్రమంలో అతనిపై ఎస్పీలు శ్రీ రవి మనోహర ఆచారి (శాంతి భద్రతలు) శ్రీ నివాసులు, శ్రీ రామకృష్ణ (తిరుమల) (i/c పరిపాలన) శ్రీ శ్రీనివాస రావు (సాయుధ దళం) AO రమేష్ కుమార్, డీఎస్పీలు, సీఐలు ఆర్ఐలు, హోంగార్డ్ సిబ్బంది పాల్గొన్నారు


c

