సిఐటియు జాతీయ మహాసభలు డిసెంబర్ 31 నుండి, జనవరి 4 వరకు జరిగే మహాసభలు జయప్రదం చేయండి! సిఐటియు జిల్లా నేతలు పిలుపు!!

సిఐటియు జాతీయ మహాసభలను ఈనెల 31 నుండి జనవరి 4వ తేదీ వరకు, మొట్టమొదట విశాఖపట్నంలో జరుగుతున్న మహాసభలను జయప్రదం చేయాలని, రాయచోటిలో విలేకరుల సమావేశంలో, సిఐటియు జిల్లా అధ్యక్షులు, సిహెచ్ చంద్రశేఖర్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏ. రామంజులు, జిల్లా ఉపాధ్యక్షులు, చిట్వేల్ రవికుమార్, జిల్లా సహాయ కార్యదర్శి, డి భాగ్యలక్ష్మి, సంయుక్తంగా పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ, స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో ఏర్పడిన, ఐక్యత పోరాటం పేరుతో, 1970 సంవత్సరంలో, ఏర్పడిన కార్మిక సంఘం, సంఘటత అసంఘటిత,కార్మిక వర్గం కోసం, ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా, సరళీకరణ, నూతన ఆర్థిక విధానాల కు వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం చేసిన కార్మిక వ్యతిరేక చట్టాలు, లేబర్ కోడులు కు వ్యతిరేకం గాను, కార్మిక హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. 1975లో ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాడిన ఏకైక సంఘం సిఐటియు మాత్రమే అన్నారు. కార్మిక కర్షక ఐక్యతతో, పెట్టుబడుదారి విధానానికి వ్యతిరేకంగా, సోషలిజం లక్ష్యంగా సిఐటియు పనిచేస్తుందన్నారు. పాలకవర్గాలు, స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇన్ని కష్టాలు కార్మిక వర్గం పడలేదని, కార్మిక వర్గం రక్షణ కోసం, విశాఖ స్టీల్ ప్రైవేటేకను వ్యతిరేకంగానూ, విభజన చట్టం హామీలు అమలు కోసం, కార్మిక చట్టాల కోసం, ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్న సంఘం సిఐటియు అన్నారు .ఈ మహాసభలను జయప్రదం చేయడానికి, దేశవ్యాప్తంగా కార్మిక నాయకత్వం ప్రతినిధులు హాజరవుతున్నారని, విదేశీ కార్మిక వర్గం ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతున్నారు అని తెలిపారు. మరో మూడు సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఈ మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని, దశా దిశా నిర్దేశించడం జరుగుతుందని. ఈ మహాసభలు జయప్రదానికి, ఆర్థిక సహాయ సహకారాలు తమ వంతు అందించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు
