*ఆదర్శప్రాయులు బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేత్కర్*
*పుత్తూరు, నారాయణవనం అంబేత్కర్ వర్ధంతి వేడుకల్లో ఎమ్మెల్యే*
*దివ్యాంగుల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపుదాం*
*అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకలో ఎమ్మెల్యే*
*బాధితునికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే*
*పిచ్చాటూరు జూనియర్ కళాశాల సమస్యలు పరిష్కరించండి*
*కలెక్టర్ వెంకటేశ్వర్లు కు ఎమ్మెల్యే ఆదిమూలం విజ్ఞప్తి*

రాజ్యాంగ నిర్మాత, భారత రత్న బాబా సాహెబ్ డాక్టర్ బి ఆర్ అంబేత్కర్ ఆదర్శప్రాయులని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు.
శనివారం బి.ఆర్ అంబేత్కర్ వర్ధంతిని పురస్కరించుకొని ఉదయం పుత్తూరు లోని కార్వేటినగరం కూడలి వద్ద ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి ఎమ్మెల్యే ఆదిమూలం గజ మాలతో ఘనంగా నివాళి అర్పించారు.
అక్కడ నుండి నారాయణవనం బైపాస్ కూడలి వద్ద చేరుకొని డాక్టర్ బి ఆర్ అంబేత్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే నివాళి అర్పించి ఆయన దేశానికి చేసిన సేవలను కీర్తించారు.
అనంతరం తిరుపతి లోని కలెక్టర్ కార్యాలయానికి ఎమ్మెల్యే చేరుకొని అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులను అక్కున చేర్చుకొని వారిలో ఆత్మ స్థైర్యాన్ని నింపుదామని పిలుపునిచ్చారు.
తదుపరి బుచ్చినాయుడు కండ్రిగ మండలం కుక్కం బాక్కం గ్రామానికి చెందిన బాధితుడు కే.బాబుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.1.44 లక్షల చెక్కును కలెక్టర్ వెంకటేశ్వర్లు ద్వారా ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
అనంతరం పిచ్చాటూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మాణం, అదనపు తరగతి గదులు, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదిమూలం కలెక్టర్ ను కోరారు.
జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడ, ఇతర సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సానుకూలంగా ఉన్నట్లు ఎమ్మెల్యే ఆదిమూలం వెల్లడించారు.
