Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించండి

*ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించండి*

*కమిషనర్ ఎన్.మౌర్య*

నగరంలో అనుమతులకు విరుద్ధంగా చేపట్టిన భవనాలు, అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్ల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం అందించిన ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎల్ఆర్ఎస్, బీపీఎస్ పై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బందితో శనివారం కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా వార్డుల వారీగా ఎల్ఆర్ఎస్, బీపీఎస్, ఐ.పీ.ఎల్.పీ దరఖాస్తులు, పరిష్కారం పై అధికారులు వివరించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లానింగ్ సెక్రటరీలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, అనధికార నిర్మాణాలు, అక్రమ లేఅవుట్లను గుర్తించి నోటీసులు ఇవ్వాలని తెలిపారు. ఎల్ఆర్ఎస్, బీపీఎస్ లకు సంబంధించి భవన యజమానులకు అవగాహన కల్పించి పరిష్కరించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఆగష్టు 31 వ తేదీ లోపు జరిగిన నిర్మాణాలను ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ద్వారా క్రమబద్దీకరణ చేసుకోవాలని ప్రజలకు తెలపాలన్నారు. గడువు అనంతరం క్రమబద్దీకరించుకోని భవనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇకపై బిపిఎస్ అవకాశం రాదనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. మీ వద్దకు వచ్చిన ఎల్ఆర్ఎస్, బీపీఎస్ దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఈ సమావేశంలో డిసిపీ ఖాన్, ఏసీపీ లు మూర్తి, మధు, టిపిబివో లు వంశి, సంతోష్, టౌన్ ప్లానింగ్ సెక్రెటరీ లు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులపై దాడులు* – *ఆటవిక పాలనకు నిదర్శనం..*

Garuda Telugu News

శ్రీ సొరకాయలతాత స్వామి ఆలయంలో వేడుకగా పౌర్ణమి పూజలు

Garuda Telugu News

మంచి పుస్తకం ఒక మంచి స్నేహితుడి వంటిది…పుస్తక పఠనం ఒక మంచి అలవాటు

Garuda Telugu News

Leave a Comment