*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి ఘన నివాళులర్పించిన కూరపాటి శంకర్ రెడ్డి*

భారతదేశపు సంఘసంస్కర్త, రాజకీయవేత్త, తొలిభారత స్వాతంత్ర కేంద్ర న్యాయశాఖ మంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు స్వర్గస్తులై ఈరోజుటికి 69 సంవత్సరాలు అవుతున్నది, ఎన్ని తరాలు మారినా ఆయన యొక్క చరిత్రను మరువలేనిది, అదేవిధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిలోని ధైర్యాన్ని, నిజాయితీని, పట్టుదలని, దేశం పట్ల గౌరవాన్ని మనం కూడా పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్య వేడు తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో సురుటుపల్లి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పద్మనాభ రాజు, పిచ్చటూరు సింగల్ విండో చైర్మన్ జయచంద్ర నాయుడు, స్టేట్ ట్రేడ్ యూనియన్ డైరెక్టర్ బాలరాజు, స్టేట్ మొదలయార్ కార్పొరేషన్ డైరెక్టర్ నమశ్శివాయ, ముని చంద్ర నాయుడు, నాగలాపురం పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ యాదవ్, క్లస్టర్ ఎండి కుమార్, పారదీపన్, నెల్సన్ మండేలా, ఎలుమలై, సుబ్రమణ్యం, నాగరాజ్, శ్రీనివాసులు నాయుడు, ప్రేమ సెల్వ కుమార్, ప్రణీత్ రెడ్డి, జాన్సన్, ఇంకా పెద్ద ఎత్తున కూటమి దళిత నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
