*కూటమి ప్రభుత్వ హయాంలో వ్యవసాయం ఒక పండుగ లాగ చేస్తున్నాము ::మంత్రి నాదెండ్ల మనోహర్*

_మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ…_
👉ఆంధ్రప్రదేశ్ లో రైతులను ఎవరైనా మోసం చేశారు అంటే అది కేవలం జగన్ మాత్రమే అని దుయ్యబట్టారు
👉రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కోల్పోయారన్నారు
👉 కూటమి ప్రభుత్వం హయాంలో 14 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసామని తెలిపారు
👉గత ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులకు ఇబ్బందులు కలుగజేశారు,మిల్లుల దగ్గర జరిగే దోపిడి మీకు తెలియదా అని సూటిగా ప్రశ్నించారు
👉రైతుల వద్దనుంచి ధాన్యం కొనుగోలు చేసి 72 వేల కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు వదిలేసి వెళ్ళారు
👉రైతులను ఆదుకునే విషయంలో గానీ, మీకు నచ్చిన సమయంలో బైటకి వచ్చి, కనీసం పొలంలో దిగడానికి కూడా మీరు ఇష్టపడలేదు..
👉ఎటువంటి వాతావరణ పరిస్థితులలోనైనా దాన్యం పాడవకుండా ఉండేందుకు రైతులకు టార్పాలిన్లు ఇచ్చినట్లు తెలిపారు
👉గత ప్రభుత్వంలో 9నెలలు రైతుకి డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకున్నారు,మేము 4 గంటల్లోనే రైతుకి డబ్బు అందేలా చేస్తున్నామన్నారు
👉 తుఫాను సమయంలో రైతులను ఆదుకునేందుకు పార్టీ నాయకులు, అధికార వర్గం శక్తి వంచన లేకుండా పాటు పడ్డారని వివరించారు
