*రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి వేగవంతం* – *ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ*
*స్వర్ణకెరటాలు(సూళ్లూరుపేట)*

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేసే దిశగా డివిజనల్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించినట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలియజేశారు. గురువారం సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారు పోరులో నూతనంగా నిర్మించిన పంచాయతీరాజ్ శాఖకు చెందిన డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి నుండి డిడిఓ కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గ్రామీణ వ్యవస్థను ప్రతిష్ట పరిచేందుకు డిడిఓ కార్యాలయాలు మరింతగా ఉపయోగపడతాయన్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో పూర్తిచేసే వీలుంటుందన్నారు. సంక్షేమ పథకాలు ప్రతిగడపకు చేరవేయడం తోపాటు అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి పల్లెకు మెరుగైన పరిపాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు,నాయకులు పాల్గొన్నారు.
