తిరుపతి జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫిరెన్స్ హాలు నందు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారి అధ్యక్షతన జిల్లా స్థాయి సమీక్షా సమావేశం.

ఈ సమీక్షా సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఇంచార్జి మినిస్టర్ మరియూ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు.
*జిల్లా స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలసి జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.*
చంద్రగిరి నియోజకవర్గంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఈ సమీక్ష సమావేశం ముందుంచారు.
ఇందులో భాగంగా గత వైసీపి ప్రభుత్వం జగనన్న కాలనీలలో ఇచ్చిన ఇంటి పట్టాలకు …. లబ్ధిదారుల చేతికి పట్టాలు అందజేశారే గాని వారికి స్థలాలు చూపించలేదు. ముఖ్యంగా చిందేపల్లి మరియు ఇతర మండలాలలో …
రాష్ట్ర పండగ దినోత్సవాల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ఎలా నిర్వహిస్తారో… అలాగే తిరుపతిలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కోరారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి మాస్టర్ ప్లాన్ అప్రోచ్ రోడ్స్ త్వరితగతిన పూర్తి చేయాలని మరియు తిరుపతి చుట్టుపక్కల ఉన్న పాడిపేట , తనపల్లి, రామాపురం బ్రిడ్జిలను పూర్తి చేయాలని కోరారు.
తిరుపతి గ్రామీణ మండలంలోని తుమ్మలగుంట, అవిలాల, పేరూరు, పరిసర ప్రాంతాలలో ఉన్న మఠం భూములను తిరుమల తిరుపతి దేవస్థానమునకు లీజు ప్రతిపాదికన అందజేసి సదరు ఆదాయమును మఠం వారికి అందజేయవలసిందిగా కోరారు.
చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాల, చిన్నగొట్టిగల్లు మరియు తిరుపతి గ్రామీణ మండలాలలో పెరికబలిజ కులస్తులకు క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇవ్వనందున సదరు సర్టిఫికెట్స్ ను మంజూరు చేయవలసిందిగా గౌరవ మంత్రివర్యులకు మరియు జిల్లా కలెక్టర్ గారికి తెలియజేశారు.
చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతి గ్రామీణ మండలానికి సంబంధించిన చెర్లోపల్లి మరియు మంగళం నందు సరికొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ మంత్రివర్యులు మరియు జిల్లా ఎస్పీ గారిని కోరడమైనది.
నియోజకవర్గంలోని ఇళ్ల స్థలాలు లేని పేద ప్రజలకు రామచంద్రపురం మండలం సర్వేనెంబర్ 28 మరియు 96 నందు 200 ఎకరాలలో సుమారు 7000 మందికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరడమైనది.
అలాగే చంద్రగిరి నియోజకవర్గంలోని గ్రామీణ మండలాలు ఆయన చిన్నగొట్టిగల్లు, పాకాల మరియు యర్రావారిపాలెం మండలాలలో పరిశ్రమలు, కళాశాలలు మరియు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయవలసిందిగా కోరారు.
వ్యవసాయ పరంగా నియోజకవర్గంలో పాకాల రామచంద్రపురం మరియు చిన్నగొట్టిగల్లు మండలాలలో యూరియా కొరత ఉందని పశువులకు దానా సరిపోవడంలేదని అందుకు అనుగుణంగా ఫీడ్ బ్యాగ్స్ సరఫరా పెంచాలని, ఈ క్రాప్ బుకింగ్ చేసుకునేదానికి రైతులకు మరికొంత సమయం పెంచాలని ఏనుగుల దాడిలో మరియు తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం అందించాలని కోరారు.
ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పథకం కింద అందిస్తున్న గోకులం షెడ్ గ్రామీణ మండలాలలో రైతులకు చాలా లాభదాయకంగా మరియు ఉపయోగకరంగా ఉందని రైతులు తెలియజేశారని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారని గౌరవ ఎమ్మెల్యే గారు తెలిపారు. ఇందులో భాగంగా మండలాలకు మరికొన్ని గోకులం షెడ్లు పరిమితిలేకుండా ఇవ్వాలని కోరారు.
విద్యుత్ శాఖకు సంబంధించి పాకాల మండలంలో ఇటీవల విద్యుత్ ఘాతంలో మరణించిన దామలచెరువు వ్యక్తికి ఇప్పటివరకు విద్యుత్ శాఖ తరపున కాంపెన్సేషన్ అందలేదని S.E ఎలక్ట్రిసిటీ వారికి తెలియజేశారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దీపం పథకం గ్రామీణ మండలాలలో అవగాహన లేక చాలామంది లబ్ధిదారులు లబ్ధి పొందలేక ఉన్నారని అటువంటి వారికి గ్రామ సచివాలయాల ద్వారా మరియు గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా అవగాహన సదస్సులు ఏర్పరిచి వారికి Ekyc చేయించి ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరే విధంగా చేయాలని రెవిన్యూ డివిజనల్ అధికారి మరియు జిల్లా సివిల్ సప్లై అధికారి వారిని కోరడమైనది.
తిరుపతి గ్రామీణ మండలంలోని తుమ్మలగుంట లో ఉన్న తుడా క్రికెట్ స్టేడియం మరియు జిమ్ ను ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా కోరారు.
రోడ్లు మరియు భవనాల శాఖకు సంబంధించి దామల చెరువు మంగళంపేట రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్&బి ఎస్.ఈ గారిని కోరడమైనది
ఇరిగేషన్ శాఖకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో 593 చెరువులు ఉండగా అందులో 33 చెరువులు ప్రమాద స్థాయిలో ఉన్నాయని వాటిని ఎఫ్డిఆర్ స్కీం లో పెట్టి మరమ్మత్తులు చేయించాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరడమైనది అందుకు జిల్లా కలెక్టర్ గారు స్పందిస్తూ తప్పకుండా చేయిస్తామని తెలిపారు. అంతేకాకుండా పేరూరు చెరువులో ఉన్న నీటిని గ్రావిటీ పంప్స్ ద్వారా తుమ్మలగుంట మీదుగా అవిలాల చెరువులోకి అనుసంధానం చేయాలని కోరారు.
ఖనిజ వనరుల శాఖకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో భాగంగా వాడుతున్న గ్రావెల్ కు సదరు శాఖ నుంచి డి.పి అనుమతులు ఇప్పించవలసిందిగా సదురు శాఖ ఏడి గారిని కోరడమైనది.
