పార్టీ అధిష్టాన నిర్ణయమే అందరికీ శిరోదార్యం

టిడిపి కార్యకర్తల సమావేశంలో పరిశీలకులు మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి
టిడిపిలో ఉన్న ప్రతి కార్యకర్త,నాయకులందరూ పార్టీ అధిష్టానం గొడుగు కింద పనిచేయాల్సి ఉందని, అందువల్ల పార్టీపరంగా తీసుకుంటున్న అధిష్టాన నిర్ణయాలు కూడా అందరికీ శిరోధార్యమని టిడిపి ప్రత్యేక పరిశీలకులు మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు.మంగళవారం సత్యవేడు బేరిశెట్టి కళ్యాణమండపంలో టిడిపి మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి సంస్థాగత ఎన్నికలపై కార్యకర్తలు నాయకులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మారెడ్డి శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్ల రాక్షస పాలనను అంతమొందించడానికి అనేక పరీక్షలను ఎదుర్కొని పార్టీ జెండాలు మోసిన నాయకులకు తగిన గుర్తిం
