Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

శివాలయ పవిత్రతకు భంగం ప్రోటోకాల్ విషయంపై ఎమ్మెల్యే ఆగ్రహం సీఎం దృష్టికి తీసుకెళ్తా — ఎమ్మెల్యే

శివాలయ పవిత్రతకు భంగం ప్రోటోకాల్ విషయంపై ఎమ్మెల్యే ఆగ్రహం సీఎం దృష్టికి తీసుకెళ్తా — ఎమ్మెల్యే

సారా.. మద్యం కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్నవారిని పవిత్రమైన శివాలయం కు ఎలా చైర్మన్గా చేస్తారు అంటూ స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీ పల్లి కొండేశ్వర స్వామి దేవస్థానంలో ప్రోటోకాల్ విషయాన్ని సంబంధిత ఈవో లత, అక్కడ సిబ్బంది విస్మరించాలంటూ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదే విషయంపై ఆలయంలోకి చేరుకున్న ఆదిమూలం ఈవో లతను ప్రశ్నలతో ముంచెత్తారు భారత రాజ్యాంగం ఇచ్చిన చట్టాలను మీరు ఎలా తుంగలోకి తొక్కుతారు.. ఎమ్మెల్యే కు ప్రోటోకాల్ ఇవ్వాలనే విషయం మీకు తెలియదా అంటూ నిలదీశారు మంచిగా పని పని చేస్తావు అని నేను నిన్ను ఇక్కడికి తీసుకు వస్తే… చైర్మన్ చెప్పాడు… రోడ్లో పోయే దానయ్య చెప్పాడు అంటూ దేవస్థానంలో ముద్రించిన కరపత్రాల్లో నా పేరు ని ఎలా తొలగిస్తావని… నీకు ఎవరు ఇచ్చారు ఈ అధికారం అంటూ ఈవోను ప్రశ్నించారు ఈ ప్రశ్నలకు ఆమె నుంచి మౌనం తప్ప… సమాధానం రాలేదు.. ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకం విషయంలో చాలా తప్పిదాలు జరిగాయి… మీరు సరిగా విచారించకుండానే అన్ని సరిగా ఉందని చెప్పడంలో మీ ఆంతర్యం ఏమిటో ఆ శివుడికి తెలియాలని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు ఆలయ ప్రధాన అర్చకుడు కార్తికేయను కూడా ఎమ్మెల్యే పలు ప్రశ్నలతో నిలదీయడం జరిగింది ఆ శివుని సేవలో తరించే మీరు… ప్రోటోకాల్ విషయాన్ని మరిచిపోయారు… మీరు కూడా ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారని అర్చకులను ఎమ్మెల్యే అడగడం జరిగింది ఆలయంలో జరిగే ప్రతి విషయం నాకు బాగా తెలుసు… ఎవరు ఎవరిని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారో కూడా తెలుసు… ఇక్కడ జరిగే అన్ని విషయాలపై సమగ్ర సమాచారం ఉంది.. నాకు ఫిర్యాదులు చేయడం అలవాటు లేదు… ఒకటికి రెండుసార్లు చూస్తా…. మళ్లీ గాడి తప్పే వారి విషయంపై చర్యలు కఠినంగా ఉండే విధంగా స్పందించడం తన నైజం అంటూ ఆదిమూలం దేవస్థానం అధికారులకు హెచ్చరిక చేశారు మద్యం కేసుల్లోనూ… రేషన్ బియ్యం అక్రమ కేసుల్లోనూ ఉండే ప్రధాన నిందితులకు పవిత్రమైన టిటిడి దేవస్థానంలో కూడా అవకాశం ఇవ్వరు..?… అయితే సురుటుపల్లిలో ఆ విషయం పక్కకు పెట్టి అన్ని రైట్ రైట్ అని ఈవో, ఇక్కడ సిబ్బంది చెప్పడం తీవ్రంగా బాధించే అంశంగా ఉందని ఆదిమూలం పేర్కొన్నారు సురుటుపల్లి ఆలయంలో పవిత్రత ముఖ్యం… హంగులు ఆర్భాటాలు వద్దు… శివ భక్తులకు మెరుగైన వసతులు… దర్శన భాగ్యం… మంచిగా ప్రసాదాలు ప్రతి ఒక్కరికి అందడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు ప్రోటోకాల్ విషయంపై తాను అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించడం జరుగుతుందని కూడా ఆదిమూలం స్పష్టం చేశారు

Related posts

షిఫ్ట్ ఆపరేటర్ సాంబయ్య కుటుంబానికి ఎమ్మెల్యే ఆదిమూలం పరామర్శ

Garuda Telugu News

యూకే నుండి శ్రీవారి సేవకు

Garuda Telugu News

మేడారం జాతరకు 3,800 బస్సులు: మంత్రి పొన్నం ప్రభాకర్!

Garuda Telugu News

Leave a Comment