ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఆకట్టుకున్న మాక్ అసెంబ్లీ

నవంబరు 26 రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్లస్ నాగలాపురం నందు విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా వేడుకలను నిర్వహించారు. ప్రపంచ దేశాలలో భారత దేశ కీర్తిని చాటినటువంటి అత్యున్నతమైనటువంటి చట్టం రాజ్యాంగం అన, రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగబద్ధంగా మసులుకుంటూ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలని, ప్రపంచ రాజ్యాంగాలలోనే విశిష్టతను సంతరించుకున్నది భారత రాజ్యాంగం అని విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు శ్రీ కస్తూరయ్య వివరించారు.
రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి భారతీయ పౌరుడికి ఉంది అని ప్రత్యేకంగా మండల విద్యాశాఖ అధికారి శ్రీ బాబయ్య గారు తెలియజేశారు. రాజ్యాంగం ప్రధాన లక్షణాలు,విశిష్టత తెలియజేసే చిత్రపటాలు, రాజ్యాంగ ప్రవేశిక,భారత రాజ్యాంగం పుస్తకం, రాజ్యాంగ రచన కమిటీ సభ్యులు మొదలైనటువంటి విషయాలను తెలియజేసే అనేక అంశాలను చిత్రపటాలుగా నమూనాలు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు,పురుషోత్తం, అయ్యప్ప,శివ కుమార్ గార్లు విద్యార్థుల చేత చక్కటి చిత్రపటాలను తయారు చేసి అలంకరించి కార్యక్రమానికి వన్నే తీసుకొచ్చారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసికట్టుగా రాజ్యాంగ పీఠిక లోని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు పాఠశాల విద్యార్థులచే నిర్వహించిన మాక్ అసెంబ్లీ అలరించింది.శాసనసభ కార్యక్రమాలు,చర్చల ద్వారా చట్టాలుగా ఎలా రూపొందించబడతాయో కళ్ళకు కట్టినట్టు విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీ బాబయ్య గారు ,పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిఆర్ఎంటి లు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఘనంగా వేడుకలు నిర్వహించారు.
