గంగమ్మ గుడి కి ఆర్యవైశ్యుల సంఘం రూ. 6 లక్షల విరాళం

తిరుపతి,నవంబర్ 25:
తాత్యయగుంట గంగమ్మ ఆలయానికి ఆర్యవైశ్య సంఘం ఆరులక్షల వెయ్యిన్ని నూట పదహారు రూపాయలు విరాళం అందించింది. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేతుల మీదుగా పాలకమండలి చైర్మన్ మహేష్ యాదవ్ కు చెక్కును ఆర్యవైశ్య సంఘం నేతలు దిండుకుర్తి నరసింహులు అందించారు. అమ్మవారి ఆలయ విస్తరణ కోసం స్థలం కొనుగోలుకు తమ ఆర్యవైశ్య సంఘం తమ వంతుగా ఆరు లక్షల విరాళం అందించిందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. దానగుణంలో ఆర్యవైశ్యులు అందరికన్నా ముందు నిలుస్తారని ఆయన చెప్పారు. గతంలోనూ గంగమ్మ ఆలయం కుంభాభిషేకం సమయంలో శిఖరాన్ని బంగారుతాపడం చేసే అదృష్టం తమ సంఘానికి కలిగిందని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దిండుకుర్తి నరసింహులు తెలిపారు. వాసవీ మాత ఆశీస్సులతో గంగమ్మ ఆలయ అభివృద్ధికి తమవంతు సాయం భవిష్యత్ లోనూ అందిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షులు
రాజా రెడ్డి, ఆర్యవైశ్య సంఘం నాయకులు
సుకుమార్, రమేష్, శ్రీరాములు, సురేష్, మధుసూదన్, రామ్మూర్తి, రమేష్ ,సందీప్ , చంద్రశేఖర్, సుష్మ, శేఖర్ ,శ్రీదేవి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
