సత్యవేడు వెలుగులో కుర్చీలకు కూడా “కరువాయే”
మహిళా సమైక్య సమావేశంలో సీసీలు నిల్చున్న దుస్థితి.

తిరుపతి జిల్లా సత్యవేడు గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో( వెలుగు) కుర్చీలు కూడా కరువైనట్టు పై చిత్రాన్ని చూస్తే తెలుస్తోంది.మంగళవారం( నిన్న) జరిగిన మండల మహిళా సమైక్య సమావేశంలో వెలుగు ఏపిఎం మినహా సీసీ లందరూ నిల్చున్న దుస్థితి ఏర్పడింది. మరి కార్యాలయంలో కుర్చీలు కూడా కరువాయాయ లేదంటే కుర్చీలు ఉన్న సీసీలు నిలిచే దుస్థితి ఏర్పడిందా అన్నది తెలియాల్సి ఉంది.ప్రధానంగా మహిళ సమైక్య సమావేశంలో స్వయం సహాయక సంఘాల రుణాలు,రికవరీ,మొండి బకాయిలు,రికార్డు నిర్వహణ, సంఘాల ఆర్థిక అభివృద్ధి తదితర పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించాల్సిన అవసరం ఉంది.ఆ మేరకు మహిళా సంఘాల సభ్యులు కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత వెలుగు ఏపీఎం, సీసీలపై ఉంది.అయితే నిర్వహణ లోపభూష్టంగా మారిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
