ఓలూరు రాయల చెరువు తెగిపోవడం వల్ల కలత్తూరు, కలత్తూరు హరిజనవాడ, పాతపాలెం గ్రామాలు తీవ్రంగా ప్రభావితమైన విషయం తెలిసిందే.

*ఈ ప్రాంతాలలో సహాయ కార్యక్రమాల కోసం రూ.20 లక్షలు ఎంపీ నిధులు కేటాయించిన ఎంపీ గురుమూర్తి గ్రామాల పునరుద్ధరణ కోసం మరో కోటి రూపాయలను ఎంపీ నిధుల నుంచి ప్రత్యేకంగా కేటాయించిన విషయం గ్రామస్థులకు పెద్ద ఊరట ఇచ్చింది.*
*ఇదిలా ఉండగా ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సత్యవేడు సమన్వయకర్త నూకతోటి రాజేష్‌లతో కలిసి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కలత్తూరు గ్రామంలో పర్యటించారు. గ్రామస్థులకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్ది తన స్వంత నిధులతో గ్రామస్థులకు సీలింగ్ ఫ్యాన్లు పంపిణీ చేశారు.*
