*ముంపు బాధితులను అన్నీ విధాలుగా ఆదుకుంటాం*
✍️ *కళత్తూరు లో బాధితులకు ఎమ్మెల్యే ఆదిమూలం ఎలక్ట్రానిక్ పరికరాలు పంపిణీ*
✍️ *కేవిబి పురం లో ప్రభుత్వ కార్యాలయాలు ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ*
✍️ *పిచ్చాటూరు జడ్పీ హైస్కూల్ లో మినీ ఆడిటోరియం నిర్మిస్తాం*
✍️ *ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం*

ముంపు గ్రామాల్లో సాధారణ పరిస్థితి నెలకొనే విధంగా బాధిత కుటుంబాలను అన్నీ విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు.
మంగళవారం ఉదయం పిచ్చాటూరు జడ్పీ హైస్కూల్ కు ఎమ్మెల్యే చేరుకున్నారు.
హైస్కూల్ లో మినీ ఆడిటోరియం నిర్మాణానికి నిధులు సమకూర్చాలని నిండ్ర మండలం ఎమ్.ఎస్.వి.యం పురం లోని అమ్మయప్పర్ గార్మెంట్స్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే ఆదిమూలం కోరారు.
అక్కడే ఉన్న గార్మెంట్స్ ప్రతినిధి శ్రీనివాస్ అందుకు అంగీకారం తెలపడం విశేషం.
పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాల అభ్యున్నతికి సాయం అందించడానికి ముందుకు వచ్చిన అమ్మయప్పర్ గార్మెంట్స్ యాజమాన్యానికి, ప్రతినిధి శ్రీనివాస్ కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం కేవిబి పురం చేరుకొని ఎంపీడీఓ కార్యాలయం, వ్యవసాయ శాఖ కార్యాలయం, వెలుగు కార్యాలయాలను ఎమ్మెల్యే ఆదిమూలం ఆకస్మిక తనిఖీ చేశారు.
కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు పట్టీ తో పాటు రికార్డులను పరిశీలించి ఎమ్మెల్యే ఉద్యోగులకు దశ నిర్దేశం చేశారు. ఏఓ కార్యాలయంలో యూరియా స్టాక్ ను ఆయన పరిశీలించారు.
అక్కడ నుండి కెవిబి పురం జడ్పీ హైస్కూల్ కు ఎమ్మెల్యే చేరుకొని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే భోంచేశారు.
తదుపరి బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే చేతులు మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ఆదిమూలం చేతుల మీదుగా పంపిణీ చేశారు.
చివరగా కళత్తూరు చేరుకొని ముంపు బాధితులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఫ్యాన్, దుప్పట్లు, బల్బులు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరూ అధైర్య పడొద్దని, ముంపు గ్రామాల్లో సాధారణ పరిస్థితి నెలకొనే విధంగా అన్నీ చర్యలు ప్రభుత్వం చేపడుతుందని ప్రజలకు ఎమ్మెల్యే బరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ, తహశీల్దారు, వ్యవసాయ అధికారి, వెలుగు ఏపీఎం, హెచ్ఎం లు అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
