తిరుమల పర్యటనకు విచ్చేసిన గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు.

తిరుమల పర్యటనలో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోనున్న ద్రౌపది ముర్ము గారు.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, టీటీడీ ఈవో సింఘాల్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర గారు, టిటిడి బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి గారు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్దకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఘన స్వాగతం పలికారు.
