*అంగరంగ వైభవంగా కైలాసకోన దేవస్థానం పాలకమండలి ప్రమాణస్వీకారోత్సవం…*

*కూరపాటి శంకర్ రెడ్డి సమక్షంలో బాధ్యతలు చేపట్టిన దేవస్థానం చైర్మన్ బాలచంద్ర నాయుడు…*
సత్యవేడు నియోజకవర్గం, నారాయణవనం మండలంలోని కైలాస కోనలో ఆదివారం దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సత్యవేడు నియోజకవర్గం టిడిపి ప్రోగ్రాం కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షలు మాధవల నాయుడు పాల్గొన్నారు.
ఈ ప్రమాణ స్వీకారం మహోత్సవానికి విచ్చేసిన కూరపాటి శంకర్ రెడ్డిని ఘనంగా ఆహ్వానించిన బాలచంద్ర నాయుడు ఆయనతో కలిసి కైలాసకోన లో వెలిసిన *శ్రీ కామాక్షి సమేత శ్రీ కైలాసనాదేశ్వర స్వామివారికి* పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం కూరపాటి శంకర్ రెడ్డి సమక్షంలో చైర్మన్ గా బాలచంద్ర నాయుడుతో పాటు 11 మంది పాలకవర్గ సభ్యులు మెంబర్లుగా ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.
*భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తాం… KSR*
కైలాస కోన దేవస్థానంకి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్నారని వారికి కావలసిన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన మౌలిక వసతులతో పాటు భద్రత కారణాల దృష్ట్యా ఒక పోలీస్ అవుట్ పోస్టును కూడా ఏర్పాటు చేస్తామన్నారు. కైలాస కోన దేవస్థానం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన బాలచంద్ర నాయుడు ఆధ్వర్యంలో కైలాసకొన దేవస్థానం మరింత అభివృద్ధి చెందుతుందని కూరపాటి శంకర్ రెడ్డి ఆశభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గంలోని మండల అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
