Garuda Telugu News | Daily Telugu News Channel In Thirupati
ఆంధ్రప్రదేశ్

మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి

మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి*

– *: ఈనెల 17 వ తేదీన కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ*

 

– *: జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి*

 

– జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్

 

తిరుపతి, నవంబర్ 16 :

 

– *మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.*

 

– *అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.*

 

*: ఈనెల 17 వ తేదీన కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ*

 

– *ఈనెల 17 వ తేదీన సోమవారం తిరుపతి కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలన్నారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్పును తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్ కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోన్ ను చెక్ చేసుకోవాలన్నారు. నోటీసులు, ఎండార్స్మెంట్ ను వాట్స్అప్ లో పంపిస్తున్నామని, ఎండార్స్మెంట్ బై రిజిస్టర్ పోస్ట్ మీరు ఇస్తున్న అడ్రస్ కు పంపిస్తున్నామన్నారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్ గా దానిని పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలన్నారు. జిల్లా ప్రజలు పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.*

 

—————————–

డి ఐ పి. ఆర్. ఓ, తిరుపతి

Related posts

విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ హుండీల లెక్కింపు

Garuda Telugu News

సీఎం చంద్రబాబు సంతకం ఫోర్జరీ.. అధికారిపై కేసు

Garuda Telugu News

ఏపీలో మందుబాబులకు షాకివ్వనున్న సర్కార్… ధరలు భారీగా పెరుగుదల

Garuda Telugu News

Leave a Comment