*ఆర్ఎస్ఎఎస్టీఎఫ్* ( *RSASTF* )

# చంద్రగిరి-శ్రీవారిమెట్టు మార్గంలో 9 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
# ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు
# దుంగలను రవాణా చేస్తున్న కారు సీజ్
తిరుపతి జిల్లా చంద్రగిరి- శ్రీవారిమెట్టు మార్గంలో కారులో అక్రమంగా రవాణా చేస్తున్న 9ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. రవాణాకు ఉపయోగించిన కారును సీజ్ చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ శ్రీనివాస్ అధ్వర్యంలో డీఎస్పీ ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ఎస్ఐ టీ.విష్ఱువర్డన్ కుమార్ టీమ్ శుక్రవారం నుంచి శ్రీవారిమెట్టు పరిసరాల్లో కూంబింగ్ చేపట్టింది. శనివారం తెల్లవారుజామున చంద్రగిరి-శ్రీవారిమెట్టు మార్గంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ మార్గంలో వేగంగా వస్తున్న ఒక కారు పోలీసులను చూసి, కొద్దిదూరంలోనే ఆగింది, పోలీసులు కారును సమీపించే లోపు కొందరు వ్యక్తులు దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే టాస్క్ ఫోర్స్ టీమ్ వారిని వెంబడించి, ఇద్దరిని పట్టుకోగలిగారు. వారిని తమిళనాడులోని కృష్ణగిరి, ధర్మపురి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. కారులో తనిఖీ చేయగా 9ఎర్రచందనం దుంగలు లభించాయి. దుంగలతో సహా, ఇద్దరు స్మగ్లర్లను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. పట్టుబడిన వారిని డీఎస్పీ వీ.శ్రీనివాస్ రెడ్డి, ఎసీఎఫ్ జె.శ్రీనివాస్ లు విచారించారు. ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
