👉 చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు

👉 చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని తిరుపతి, పాకాల, రామచంద్రాపురం, చంద్రగిరి, యర్రావారిపాలెం, చిన్నగొట్టుగళ్ళు మండలాలకు సంబంధించిన పలువురికి సీఎంఆర్ఎఫ్ ద్వారా 50లక్షల 02 వేల 297 రూపాయలను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం.
👉 సిఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులివర్తి నాని గారు.
👉 కష్టకాలంలో మా కుటుంబాలను ఆదుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తేలిపిన బాధితులు.
తిరుపతి,
తిరుపతి రూరల్ మండలం పరిధిలోని తనపల్లి రఘునాథ్ రిసార్ట్స్ లోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తిరుపతి, పాకాల, చంద్రగిరి, రామచంద్రాపురం, యర్రావారిపాలెం,చిన్నగొట్టుగళ్ళు
మండలాలకు సంబందించిన పలువురికి సిఎంఆర్ఎఫ్ సహయనిధి ద్వారా సుమారు 50 లక్షల 2 వేల 297 రూపాయలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. అనారోగ్య ,ఇతర సమస్యలతో బాధపడుతున్న విషయం స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే గారు.తక్షణమే స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనారోగ్య, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయాలని ఉన్నత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.సిఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గారు. కష్టకాలంలో మా కుటుంబాలను ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన భాధిత కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
