సత్యవేడు బీజేపీ నాయకుల సంభరాలు..

ఈ రోజు బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో 243 స్థానాలకు గాను 200 లకు పైగా మరొకసారి గెలుపొందిన ఎన్ డీ ఏ కూటమి ప్రభుత్వం. బీజేపీ మండల అధ్యక్షులు సత్యవేడు బాలాజీ ఆధ్వర్యంలో మండల బీజేపీ సీనియర్ నాయకులు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి మునికృష్ణయ్య ముఖ్య అతిధిగా పాల్గొనగ టపాసులు పేలుస్తూ స్వీట్లు అందరికి పంచి పెడుతూ సంభరంగా కొనియాడారు.
బాలాజీ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్ డీ ఏ కూటమి ప్రభుత్వానికి మరలా మద్దతుగా నిలిచి చారిత్రాత్మకమైన విజయాన్ని అందించిన బీహార్ ప్రజలందరికీ ధన్యవాదములు తెలిపారు. దేశ వ్యాప్తంగా ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అలాగే దేశఅభివృద్ధి దేశ ప్రజల రక్షణ కొరకు తీసుకుంటున్న గొప్ప నిర్ణయాలను దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని దేశాన్ని అభివృద్ధి చేయడం నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోని భారతీయ జనతా పార్టీ వలెనే సాధ్యమని నమ్ముతున్నారని 24 గంటలు అసత్య ప్రచారం చేస్తూ ఓట్ చోరీ ఈవిఎం హాక్ లంటూ దేశంలో ఏదో రకంగా అలజడి సృష్టించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి తమ వంతు బాధ్యతగా గుణపాఠం నేర్పాలని బీహార్ ప్రజలు తమ వంతు బాధ్యతగా ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకుని కాంగ్రెస్ పార్టీకి చెంప పెట్టుగా బదులిచ్చారని బీహార్ ప్రజలను కొనియాడారు.
2047 కల్లా వికసిత్ భారత్ గా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన ప్రధాని మోదీ గారి నాయకత్వంలోని ఎన్ డీ ఏ ప్రభుత్వానికి దేశ ప్రజల మద్దతు అలాగే భగవంతుని ఆశీర్వాదం మెండుగా ఉందంటూ సంతోషం వ్యక్తపరిచారు.
దేశాభివృద్ధి, ప్రజల సంక్షేమం, దేశ రక్షణ కొరకు పనిచేస్తున్న అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీగా కొనియాడారు.
ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు బండారు మోహన్ బాబు, డి శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శి జే నరేంద్ర బాబు, మండల సోషల్ మీడియా కన్వీనర్ భువనేష్,నాగభూషణం యువ మోర్చా పార్థసారధి, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
